డయల్ 100 కాదు, ఇక అన్ని ఎమర్జెన్సీ సేవలకు ఒకే నెంబర్ 112..!!

ఇక నుంచి అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కి కాదు. కొత్త నెంబర్ కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల అత్యవసర సేవలను ఒకే నెంబర్ పరిధిలోకి తీసుకొచ్చారు. అంబులెన్స్‌, పోలీసు, అగ్నిమాపక సేవలు.. ఇకపై అన్నింటికీ ఒకే ఫోన్‌ నంబర్‌. అదే.. డయల్‌ 112. దీని ద్వారా ఎవరు ఏ ఆపదలో ఉన్నా.. ఈ నెంబర్ కు సమాచారం ఇవ్వటం ద్వారా వెంటనే కావాల్సిన సాయం పొందే అవకాశం ఉంటుంది.

Advertisement

తెలంగాణలో ఇక నుంచి అన్ని రకాల ఎమర్జెన్సీ సేవలకు ఒకటే నెంబర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఫైర్, పోలీసు, అంబులెన్సులకు వేర్వేరుగా నెంబర్లు ఉండేవి. అయితే, ఇప్పుడు ఈ తరహా ఎమర్జెన్సీ సేవలన్నీ ఒకే నెంబర్ పరిధిలోకి తీసుకొచ్చారు. అన్ని అత్యవసర సేవల సమైక్య అనుసంధానం కోసం డీజీపీ సీవీ ఆనంద్ 'డయల్ 112' (Dial 112) అత్యవసర సేవలను అధికారికంగా ప్రారంభించారు. "వన్ నేషన్ - వన్ ఎమర్జెన్సీ నంబర్" లక్ష్యంతో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సాంకేతికతను జోడిండి... ఎవరైనా సమస్యల్లో ఉన్నవారికి వెంటనే అందుబాటులోకి వచ్చే విధంగా రూపకల్పన చేసినట్లు వెల్లడించారు.

Advertisement
డీలిమిటేషన్ పై ఊహించని నిర్ణయం, మారుతున్న లెక్కలు- ఇక నెక్స్ట్.!!

తక్షణ సాయం అందించే విధంగా ఏర్పాట్లు

ఈ 112 వ్యవస్థను డ్రోన్‌లతో అనుసంధానించాలని నిర్ణయించారు. దీని ద్వారా ఫిర్యాదు వచ్చిన ప్రాంతం లో డ్రోన్ ద్వారా వెంటనే పర్యవేక్షణ.. సమాచారం పొందే అవకాశం కలుగుతుంది. కాగా, తెలంగాణ ఇంటెలిగెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ద్వారా ఈ కాల్స్ అన్నీ నిరంతరం పర్యవేక్షించనున్నారు. నాన్-ఎమర్జెన్సీ మరియు స్పామ్ కాల్స్‌ను ఫిల్టర్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వినియోగిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, గొడవలు, దోపిడీలు, వేధింపుల వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్‌కు కాల్‌ చేస్తే వెంటనే సహాయం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ నంబర్‌కు కాల్‌ వచ్చిన వెంటనే కాలర్‌ లొకేషన్‌ సమాచారాన్ని సమీప పోలీసు బృందాలకు చేరవేయనున్నారు. అవసరమైతే ఇతర అత్యవసర స్పందన వ్యవస్ధలతో అనుసంధానం చేస్తామని అధికారులు స్పష్టం చేసారు.

English Summary

Telangana DGP C. V. Anand has launched the unified 112 emergency helpline, replacing Dial 100 with a single 24/7 number