తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్-2026 నోటిఫికేషన్ విడుదల అయింది. గతంలో ప్రకటించిన విధంగా మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆగస్టు 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. పోలీస్, జైళ్ల శాఖ, SPF, ఫైర్ విభాగాల్లో నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో పోలీస్ రిక్రూట్‌మెంట్ కోసం అధికారికంగా నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం తేదీలు ఖరారు చేసింది. ఇందుకోసం ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. దరఖాస్తులను కేవలం www.tgprb.in ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులను స్వీకరించే అవకాశం లేదని స్పష్టం చేసారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసే ముందు అభ్యర్థులు తమ మొబైల్‌లో "ఆధార్ ఫేస్ అథెంటికేషన్ యాప్" డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. అప్లికేషన్ సబ్‌మిట్ చేసిన తర్వాత ప్రింట్‌అవుట్ తప్పనిసరిగా భద్రపరచుకోవాలని బోర్డు స్పష్టం చేసింది.
హైదరాబాద్లో 3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు - మళ్లింపులు ఇలా..!!
కాగా, సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులకు: SC / ST అభ్యర్థులకు ఫీజు: ₹750 గా నిర్దారించారు. ఇవే పోస్టులకు ఇతరులకు (General / BC): ₹1,500 కానిస్టేబుల్ పోస్టుల కోసం SC / ST అభ్యర్థులకు ఫీజు: ₹600 ఇతరులకు (General / BC): ₹1,200 గా నిర్ణయించారు. ఇక.. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ లో భాగంగా ఒక్కసారి చెల్లించే ఫీజుతోనే మొత్తం ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. కామన్ PMT/PET: బహుళ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శారీరక కొలతల పరీక్ష, భౌతిక సామర్థ్య పరీక్ష ఒకేసారి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శాఖల వారీగా పూర్తి నోటిఫికేషన్ వివరాలతో పాటుగా అర్హతల సమాచారం కోసం అభ్యర్థులు www.tgprb.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.దరఖాస్తులు.. ఫీజులు