కొత్త పెన్షన్లు అందేది వీరికే, జాబితా సిద్దం - పంపిణీ మార్గదర్శకాలు..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల పంపిణీ మార్గదర్శకాలు ఖరారయ్యాయి. సీఎం రేవంత్ ఇప్పటికే కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి చేయూత పథకం కింద కొత్త పింఛన్లు అందించనుంది. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులలో అర్హులైన వారందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారు. దాదాపు పది లక్షల మందికి కొత్త పెన్షన్ల కోసం రూ 2,500 కోట్ల మేర ప్రభుత్వం పైన భారం పడుతుందని లెక్కలు తేల్చారు.

Advertisement

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీకి రంగం సిద్దమైంది. కుల గణన లెక్కల మేర తేల్చిన అర్హులకు అనుగుణంగా కొత్త లబ్దిదారులను ఖరారు చేస్తున్నారు. కొత్తగా తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా బాధితులకు కూడా పింఛన్లు అందిచాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా అర్హులను వెంటనే గుర్తించాలని సూచించారు. ఈ మేరకు తొలి దశలో సుమారు 2.5 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల చేయూత పెన్షన్లు అందుతుండ గా.. కొందరు అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు క్షేత్ర స్థాయి సమాచారం సేకరణలో తేలినట్లు చెబుతు న్నారు. వీరి పైన వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందే అనర్హులను గుర్తించి ఏరి వేయాలని భావిస్తున్నారు. కాగా.. 2026-27 వార్షిక బడ్జెట్ లోనూ కొత్త పెన్షన్ల పంపిణీ పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

Advertisement
ఇక సిద్దం అయిపోండి, ఆగస్టు 5 - కేంద్రం సంచలన నిర్ణయం..!?

పంపిణీకి ప్రభుత్వం తుది కసరత్తు

కాగా, తాజాగా సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్తగా అర్హులైన వారిని గుర్తించి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం కొత్త పెన్షన్లకు 10.40 లక్షల మందికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికుల్లో అర్హులైన వారందరికీ పింఛన్లను పంపిణీ చేయాలని రేవంత్ ఆదేశించారు. అర్హులైన ప్రతీఒక్కరికీ తప్పనిసరిగా ఇవి అందాలన్నారు. దివ్యాంగులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి పించన్ అందించాలని, పించన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీంతో.. ఆగస్టు 15వ తేదీకి ముందే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి లబ్దిదారులకు సమాచారం అందే విధంగా కసరత్తు జరుగుతోంది. అనర్హులను ఏరి వేస్తూనే.. అర్హత ఉన్న అందిరికీ పెన్షన్ అందుతుందని ప్రభుత్వంలోని ముఖ్యులు స్పష్టం చేస్తున్నారు.

English Summary

Telangana government has decided to start the distribution of new pensions from August 15 to the eligible beneficiaries