సాధారణంగా ఒక సోషల్ మీడియా రీల్‌కు కొద్ది లక్షలు లేదా ఐదారు కోట్ల వ్యూస్ వస్తేనే "అబ్బో.. వైరల్ అయిపోయింది!" అని పండగ చేసుకుంటారు. కానీ, ఒక తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన ఒక చిన్న రీల్ మాత్రం ఏకంగా 100 కోట్ల వ్యూస్ అంటే 1 బిలియన్ వ్యూస్ సాధించి ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచంలోనే సంచలనం సృష్టించింది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు కూడా లేని ఆ పేజీకి అంతటి అరుదైన గ్లోబల్ గుర్తింపు దక్కడం ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది.
Trump: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏఐ పిక్స్! శత్రువులకు బిగ్ వార్నింగ్
లైఫ్ స్టైల్, హెయిర్ స్టైల్
ఇన్‌స్టాగ్రామ్‌లో 'the.fashiontoast' అనే హ్యాండిల్‌తో ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, హెయిర్ స్టైల్ టిప్స్ అందిస్తుంటారు ఒక తెలుగు క్రియేటర్. ప్రస్తుతం ఈ పేజీని దాదాపు 3.96 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఫాలోవర్ల సంఖ్య కంటే కంటెంట్ అందరికీ ఉపయోగపడేలా ఉంటే చాలని నిరూపిస్తూ.. ఈ క్రియేటర్ మే 1న పోస్ట్ చేసిన ఒక చిన్న వీడియో ఇంటర్నెట్‌ను ఊపేసింది. మొదట్లో సాధారణంగానే ప్రారంభమైన ఈ వీడియో, కొద్దిరోజుల్లోనే దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరి మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమైంది.
సాధారణంగా సెలూన్‌కి వెళ్లి కొత్తగా ఏదైనా హెయిర్‌కట్ చేయించుకున్నాక, అది మన ముఖానికి సూట్ కాక నిరాశ చెందే పరిస్థితి చాలామందికి ఎదురవుతుంటుంది. సరిగ్గా అందరికీ ఎదురయ్యే ఈ కామన్ ప్రాబ్లమ్‌కి సదరు క్రియేటర్ ఒక వినూత్నమైన AI సొల్యూషన్ చూపించారు. మన ఫొటోను చాట్ జీపీటీ ఇమేజ్ జనరేషన్ 2.0లో అప్‌లోడ్ చేసి, సెలూన్ కుర్చీలో కూర్చోకముందే రకరకాల హెయిర్ స్టైల్స్‌ను వర్చువల్‌గా ట్రై చేయవచ్చని ఆ వీడియోలో చూపించారు. మన ముఖానికి ఏ హెయిర్ కట్ నప్పుతుందో ఏఐ ద్వారా ముందే తెలుసుకుని, అదే పిక్‌ని బార్బర్‌కి చూపిస్తే అసలు సమస్యే ఉండదని చాలా సింపుల్‌గా వివరించారు. దీనికి తోడు ఈ వీడియోకు క్రియేటర్ జోడించిన క్యాప్షన్ కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. "సెలూన్ కుర్చీలో కూర్చోకముందే మీ ఫొటోను చాట్ జీపీటీలో అప్‌లోడ్ చేసి, మీకు నప్పే హెయిర్‌స్టైల్‌ని ముందుగా మీరే టెస్ట్ చేసుకోండి.. ఆ తర్వాతే బార్బర్‌కు చెప్పండి" అంటూ ఇచ్చిన క్లియర్ మెసేజ్ ప్రతిఒక్కరికీ కనెక్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది యూజర్లు ఈ ట్రిక్‌ను ప్రాక్టికల్‌గా ఫాలో అవ్వడం మొదలుపెట్టడంతో, ఈ వీడియో ఏకంగా 100 కోట్ల వ్యూస్ మార్కును దాటేసి ఒక తెలుగు క్రియేటర్ సాధించిన అరుదైన గ్లోబల్ రికార్డుగా నిలిచింది.వినూత్నమైన పరిష్కారం
సోషల్ మీడియాలో ఆ వీడియోలు, పోస్టులపై సుప్రీంకోర్టు నిషేధం..!
క్యాప్షన్ నచ్చింది