తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బస్సు సర్వీసులను అన్ని ప్రాంతాల్లోనూ మరింతగా విస్తరించే ప్రణాళికల పైన కసరత్తు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరిగిన ట్రాఫిక్ తో కొన్ని ప్రాంతాల్లో బస్సు సర్వీసుల నిర్వహణ కష్టంగా మారుతోంది. దీంతో.. కొత్తగా మినీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్దమైంది. అయితే, ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఆర్టీసీ అధికారులు కొత్తగా మినీ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. గతంలో ఈ బస్సులు నిర్వహణ ఉన్నా.. తరువాతి కాలంలో రెగ్యులర్ బస్సులే నగరంలో పరుగులు తీసాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు నగర వ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ.. ఈ మినీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. పెరిగిన ట్రాఫిక్‌తో సులభంగా ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చేందుకు శివారు ప్రాంతాల్లో ఫీడర్ సర్వీసులు నడుపాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో మినీ బస్సులు రోడ్లపైకి తీసుకుచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది. గతంలో సెట్విన్ బస్సులు నగరంలోని పలు ప్రాంతాల్లో తిరిగేవి. కాగా.. ఇప్పుడు ఇదే తరహా మినీ బస్సులను తిరిగి అందుబాటులోకి తేవటం పైన కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. వీటి ద్వారా క్యూర్ పరిధిలో ఆర్టీసీ సేవలు మరింత విస్తరించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు అదిరిపోయే ఆఫర్..!!
కొన్నేళ్ళ క్రితం చార్మినార్ ప్రాంతంలో 100 మినీ బస్సులు నడిపిన ఆర్టీసీ అవి పాతబడటంతో తొలిగించారు. దీంతో కొత్తగా మొదటి దశలో 100 మినీ బస్సులు అందుబాటులోకి తీసుకురా వాలని భావిస్తోంది. ఈ బస్సుల్లో సాధారణంగా 18 నుండి 30 సీట్ల ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. అయితే, నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశిస్తున్న వేళ.. వీటిని రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ప్రభుత్వం- ఆర్టీసీ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం ఈ బస్సుల్లో అమలు చేస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకం అమలు చేస్తామని గతంలో మంత్రులు వెల్లడించారు. దీంతో.. ఇప్పుడు ఈ బస్సుల విషయంలో అధికారికంగా నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది.త్వరలోనే అధికారిక నిర్ణయం