అమరావతిలో దేశంలోనే మొదటి AI ప్లస్ క్యాంపస్..!!
దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీ అమరావతి కేంద్రంగా ఏర్పాటు కానుంది. ఈ మేరకు కసరత్తు మొదలైంది. ఏపీ ప్రభుత్వం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు పైన ఇప్పటికే ప్రకటన చేసింది. కాగా, తాజాగా అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు బిర్లా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్-బిట్స్ విశ్వవిద్యాలయ కులపతి.. పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా ప్రకటించారు. రానున్న రెండేళ్ల కాలంలో అందుబాటులోకి రానుంది.
ఏపీ రాజధాని అమరావతికి మరో అరుదైన ఘనత దక్కింది. అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు కానుంది. 7000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతా మని కుమార మంగళం బిర్లా వెల్లడించారు. అమరావతి క్యాంపస్‌ను ఆధునిక సాంకేతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కృత్రిమ మేథ, డేటాసైన్స్, రోబోటిక్స్, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. కాగా, రెండు దశల్లో ఏడు వేల మంది విద్యార్ధులకు అవకాశం కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు.

దేశంలో ఇప్పటివరకు ఎక్కడా ఇలాంటి క్యాంపస్ లేదని ఆయన తెలిపారు. దేశంలో ఉన్నతవిద్య దిశను మార్చేందుకు తొలి అడుగుగా ఈ క్యాంపస్‌ను తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో రెండే ళ్లు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో రెండేళ్లు అభ్యసించేలా డిజైన్ చేస్తున్నామని జాయింట్ పీహెచ్‌డీలు చేయొచ్చని బిర్లా వివరించారు.
#BITScomingToAP
— N Chandrababu Naidu (@ncbn) July 14, 2025
I thank Mr Kumar Mangalam Birla, Chairman of the Aditya Birla Group and Chancellor of BITS, for taking a bold step to transform higher education in India with the announcement of the AI Plus Campus in Andhra Pradesh. This first-of-its-kind campus will be a… pic.twitter.com/s4zveKPJ7B
అమరావతి క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కాబోతోంద ని కంప్యూటర్ సైన్సులోని అన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అక్కడ ఉంటాయని ఉపకులపతి రామ గోపాలరావు చెప్పారు. వివిధ మైనర్ ప్రోగ్రామ్స్‌ను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రంగాల కోర్సులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఐవోటీ, ఏఐ ఆధారిత సేవలతో డిజిటల్ ఫస్ట్ క్యాంపస్ రూపు దిద్దుకుంటుందని వివరించారు. క్యాంపస్ ఏర్పాటుకు సీఐర్డీఏ 70 ఎకరాలు కేటాయించింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications