Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏఐతో విమాన ప్రమాదాలకు చెక్.. సంచలన నివేదిక ఏం చెప్పిందో తెలుసా..?

అన్ని రకాల ప్రయాణాల్లో విమాన ప్రయాణాలే సురక్షితం అని నిపుణులు చెబుతుంటారు. కానీ గత కొన్నేళ్లుగా విమాన ప్రమాదాలు అధికం అయ్యాయి. బస్సు లేదా రైలు అయితే కొంతమందైనా ప్రాణాలతో బయట పడే అవకాశం ఉంది. కానీ విమాన ప్రమాదాల్లో అయితే మరణ రేటు అధికంగా ఉంటుంది. వందల అడుగుల నుంచి విమానాలు కుప్పకూలడంతో అగ్ని కీలలు ఎగిసిపడి ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు.

ప్రస్తుతం సాంకేతిక, డిజిటల్ యుగం నడుస్తోంది. అసాధ్యం అనుకున్న ప్రతి పనిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) చేసి చూపిస్తోంది. ఇప్పుడు అన్ని రంగాల్లోకి ఏఐ చొచ్చుకుపోయింది. మరి ఇంతటి టెక్నాలజీ యుగంలోనూ విమాన ప్రమాదాలు జరగడం గమనార్హం. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లోపం, నాణ్యతా లోపం కారణాలుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏఐ ను ఉపయోగించి ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చా..?

ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది మరణించారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. దీంతో ఏఐ వినియోగంపై చర్చ మొదలైంది. అయితే ఇటీవల విడుదలైన ఓ నివేదిక ఏం చెబుతుందో తెలుసా.. ?

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) ను సమర్థవంతంగా వినియోగిస్తే విమాన ప్రమాదాలను అరికట్టవచ్చని నివేదిక స్పష్టం చేసింది. ఏఐకు వైమానిక ప్రయాణాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, రూల్స్, వాతావరణ అనుకూల ప్రతికూల పరిస్థితులపై అవగాహన ఉంటుందని ముందుగానే విమాన సిబ్బందికి ఏఐ వివరిస్తుందని తేలింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఫైలట్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా సూచించే సామర్థ్యం ఏఐకు ఉందట. అంతేకాక 2032 నాటికి ఏఐ ను వైమానిక రంగంలోకి ప్రవేశ పెట్టేందుకు 22.8 బిలియన్ డాలర్లు ఖర్చుచేయనున్నట్లు సమాచారం అందుతోంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) కు ప్రమాదాలను ముందుగానే గుర్తించే శక్తి ఉందట. దీంతో ప్రమాదాలను నివారించడంతోపాటు ఏమైనా చిన్నచిన్నవి జరిగినా మృతుల సంఖ్యను భారీగా తగ్గించవచ్చని తేలింది. పైలట్ తప్పిదాలతోనే 53 శాతం విమాన ప్రమాదాలు జరుగుతున్నాయట. దీంతో ఎమర్జెన్సీ సమయాల్లో ఫైలట్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఏఐ సూచనలు చేస్తుందట.'

వైమానిక రంగంలో ఏఐ సేవలు..

సెన్సార్ డేటా ఆధారంగా ముందుగా వచ్చే ప్రమాదాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) నివారిస్తుంది. దీంతో మెకానికల్ తప్పిదాలు జరగకుండా ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. రియల్ టైమ్ మోనిటరింగ్ ద్వారా విమానంలోని ప్రతి కదలికలు, కుదుపులను ఎప్పటికప్పుడు ఫైలట్ లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కు చేరవేస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ ను పరిశీలిస్తుంది. పైలట్ నిర్ణయం తీసుకోవడంలో సాయపడుతుంది. నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రయాణికుల భద్రతకు సూచనలు చేస్తుంది.

Revolutionizing Aviation How AI Analyzes Flight Accidents in Analytics Inside Report

సవాళ్లు..

వైమానిక రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) ను వినియోగించాలంటే అధిక పెట్టుబడి అవసరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక పైలట్ కు ఏఐ పైనా పూర్తి పరిజ్ఞాణం అవసరం అని వివరించారు. సైబర్ సెక్యూరిటీ, ఏఐ ను వినియోగించే నైపుణ్యం కలిగిన సిబ్బంది పైనా సవాళ్లు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+