నిరుద్యోగులకు సువర్ణావకాశం.. త్వరలో 50 వేల కొలువులు
Job Notifications: నిరుద్యోగ యువతకు నిజంగా ఇది శుభవార్తే. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగాలం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న అభ్యర్థులకు తాజాగా ఒక కీలకమైన అప్డేట్ అందింది. త్వరలోనే సుమారు 50,000 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం.
12 ప్రభుత్వం రంగ బ్యాంకుల్లో భారీ నియామకాలు
2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు 50,000 మంది ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇది నిరుద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే వార్త.
పోస్టుల వివరాలు ఇలా..
ఈ క్రమంలో ఖాళీ విషయానికొస్తే.. ఈ భారీ నోటిఫికేషన్‌లో 21,000 పోస్టులు ఆఫీసర్ విభాగంలో ఉండనున్నాయి. మిగిలిన పోస్టులు క్లర్కులు, ఇతర సిబ్బంది కేటగిరీల కింద భర్తీ చేయబడతాయి.

ఎస్బీఐలో అత్యధిక ఖాళీలు
ఈ నియామకాల్లో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఒక్కటే దాదాపు 20 వేల మందిని నియమించుకునే అవకాశం ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,500 మందిని, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,000 మందిని నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన బ్యాంకుల నియామకాల వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
2025 మార్చి నాటికి ఈ 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 2,36,226 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 1,15,066 మంది ఆఫీసర్లుగా ఉన్నట్లు సమాచారం. ఈ కొత్త నియమాకాలతో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తమ సన్నద్ధతను మరింత ముమ్మరం చేసుకోవాలని సూచించబడుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యువత తమ కలలను నిజం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications