ఏపీ ఈసెట్ - 2025 ఫలితాలు విడుదల..
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (

పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్‌టికెట్ నంబర్, మరియు పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను చూసేందుకు విద్యార్ధులు https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx ఈ లింక్‌ను ఉపయోగించవచ్చు.
లేటరల్ ఎంట్రీ ద్వారా అవకాశం..
AP ECET 2025 ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా మరియు B.Sc (మ్యాథమెటిక్స్) పూర్తి చేసిన అభ్యర్థులకు 2025-26 విద్యాసంవత్సరానికి B.E./B.Tech/B.Pharmacy కోర్సుల్లో రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు.
పరీక్షా వివరాలు
ఈ ఏడాది మే 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 110 పరీక్ష కేంద్రాల్లో ఈసెట్ పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో కూడా ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు మొత్తం 35,187 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 31,922 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్
ఫలితాల విడుదల తర్వాత, అర్హులైన అభ్యర్థుల కోసం AP ECET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ను APSCHE త్వరలో ప్రకటించనుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా సందర్శిస్తూ తాజా సమాచారం తెలుసుకోవాలి.












Click it and Unblock the Notifications