AP DSC 2024: ఏపీ డీఎస్సీ పరీక్షలపై ప్రభుత్వం కీలక ప్రకటన..!
ఏపీలో ఎన్నికల వేళ డీఎస్సీ పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ విషయంలో ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి పరిస్ధితి ఏర్పడింది. ఈ మేరకు ఈసీకి ప్రభుత్వం తాజాగా లేఖ కూడా రాసింది. దీన్ని నిర్దారించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా త్వరలో క్లారిటీ ఇస్తామని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో డీఎస్సీపై కీలక ప్రకటన చేసింది. ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఎన్నికల కమిషన్ కు డీఎస్సీ పరీక్షల నిర్వహణకు అనుమతి కోరుతూ లేఖ రాసినందున అక్కడి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా డీఎస్సీ పరీక్షల తదుపరి షెడ్యూల్ ప్రకటిస్తామని విద్యాశాఖ క్లారిటీ ఇచ్చేసింది. ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణ కోసం ఈసీ అనుమతి కోరిన ప్రభుత్వం అది కాస్తా ఆలస్యం కావడంతో హాల్ టికెట్ల జారీ, పరీక్షా కేంద్రాల ఎంపికతో పాటు ఇతర ప్రక్రియల్ని నిలిపేసింది. అలాగే ఇప్పటికే నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు ఈసీ అనుమతి లభిస్తేనే వీటిని ప్రకటిస్తారు. లేకపోతే ఎన్నికల తర్వాతే టెట్ ఫలితాల వెల్లడి, డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఉంటాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications