JEE Main 2025: లాస్ట్ మినిట్ లో పరీక్షా కేంద్రం మార్పు-ఎన్టీఏ షాకింగ్ నిర్ణయం..!

ఈ ఏడాది జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జేఈఈ మెయిన్ లో బీఈ, బీటెక్ అభ్యర్ధుల కోసం జనవరి 22 నుంచి సెషన్ 1 పేపర్ 1 పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులకు ఇప్పటికే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పలు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. వీటిని తప్పనిసరిగా పాటించాలని కూడా స్పష్టం చేసింది. అంతవరకూ బాగానే ఉన్నా పరీక్షా కేంద్రాల విషయంలో మాత్రం షాకిచ్చింది.

చివరి నిమిషంలో జేఈఈ పరీక్షా కేంద్రాల్లో మార్పులు చేస్తూ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్పులు జరిగిన కేంద్రాల వివరాలను వెబ్ సైట్ లో ప్రకటించింది. దీంతో తమ కేంద్రాల్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉందా లేదా అన్న దానిపై మిగతా సెంటర్లలో పరీక్షలు రాసే అభ్యర్ధుల్లోనూ టెన్షన్ మొదలైంది. ప్రస్తుతానికి చేసిన పరీక్షా కేంద్రం మార్పులు మాత్రం వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి.

JEE Main 2025 NTA informs last minute Change in Exam centre - here are details

జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ పరీక్షలను భారత్ తో పాటు విదేశాల్లోని సెంటర్లలో కూడా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షార్జా సెంటర్ లో మార్పు చేసినట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఈ కేంద్రాన్ని షార్జాలోని కొత్త కేంద్రం స్కాలర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, 1501-1502, ది ఫస్ట్ టవర్, అల్ మజాజ్-3, షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పిన్‌కోడ్- 50001కు మార్చినట్లు తెలిపింది.

ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, సీఎఫ్టీఐల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎన్టీఏ జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో జేఈఈ మెయిన్స్ పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తుంది. అలాగే ఇది ఐఐటీ అడ్మిషన్లకు అవసరమైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్షగా కూడా పనిచేస్తుంది.అలాగే పేపర్ 2 పరీక్ష బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులకు నిర్వహిస్తుంది. దీన్ని పేపర్ 2A (బీఆర్క్) , పేపర్ 2B (బీప్లానింగ్) గా జనవరి 30న నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+