NPCCలో ఉద్యోగాలు: పరీక్ష లేకుండానే జాబ్.. మంచి జీతం, అర్హతలు ఇవే..!!

నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్‌ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ఎన్‌పీసీసీ) తాజా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా సైట్ ఇంజినీర్ మరియు డిప్లొమా ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎన్‌పీసీసీ కేంద్రప్రభుత్వ రంగ సంస్థగా ఉంది. ఇది ఇంజినీరింగ్, నిర్మాణం, ప్లానింగ్, ఆపరేషన్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీగా కూడా వ్యవహరిస్తోంది. ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, థర్మల్, హైడ్రోఎలక్ట్రిక్, టనెలింగ్, రైల్వే, హైవేస్, రవాణా, టౌన్‌షిప్స్, భవంతిలు, డ్యామ్‌లు, బ్రిడ్జిలు, ప్రజారోగ్యం, పర్యావరణ ఇంజినీరింగ్, బోర్డర్ ఫెన్సింగ్ మరియు ఫ్లడ్‌లైట్ ప్రాజెక్టులపై ఎక్కువగా పనిచేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఎన్‌పీసీసీ తన ప్రాజెక్టులో పనిచేసేందుకు ఐదు సైట్ ఇంజినీర్ మరియు ఐదు జూనియర్ సివిల్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది.

సైట్ ఇంజినీర్ మరియు సివిల్ ఇంజినీర్ పోస్టులు పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికనే ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్‌గఢ్‌లో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. సైట్‌ ఇంజినీర్ (సివిల్‌)కు విద్యార్హతలు ఈ విధంగా పేర్కొంది. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ. అది కూడా 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే సమయంలో ఏదైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో కనీసం రెండేళ్లు పని అనుభవం కలిగి ఉండాలి. ఇక ఇందులో వినియోగించే సాఫ్ట్‌వేర్‌పై అవగాహన కలిగి ఉండాలి. సైట్ ఇంజినీర్‌కు నెలకు రూ.33,750/- వేతనంగా చెల్లిస్తారు.

NPCC Recruitment 2021: Apply for site Engineer and Junior Engineer posts

ఇక జూనియర్ ఇంజినీర్ (సివిల్)కు విద్యార్హతలు ఇలా ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి మూడేళ్ల సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా. అది కూడా 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే సమయంలో ఏదైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో కనీసం రెండేళ్లు పని అనుభవం కలిగి ఉండాలి. ఇక ఇందులో వినియోగించే సాఫ్ట్‌వేర్‌పై అవగాహన కలిగి ఉండాలి. సైట్ ఇంజినీర్‌కు నెలకు రూ.25,650/- వేతనంగా చెల్లిస్తారు.

ఇక ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ నుంచి 12శాతం పీఎఫ్ జమ చేయబడుతుంది అదేసమయంలో మెడికల్ అలవెన్స్ కింద నెలకు రూ.1250/- కూడా చెల్లించడం జరుగుతుంది. సైట్ ఇంజినీర్‌కు అప్లయ్ చేసుకునే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లు మించి ఉండరాదు. ఇక జూనియర్ ఇంజినీర్ పోస్టుకు అప్లయ్ చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లకు మించి ఉండరాదు. ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎంపికైన అభ్యర్థులు మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గఢ్‌లో పోస్టింగ్‌ ఇవ్వబడుతుంది.

సైట్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్ పోస్టుల పట్ల ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2021 అక్టోబర్ 7వ తేదీన ఉదయం 10:30 గంటలకు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు అన్ని డాక్యుమెంట్లు విద్యార్హత సర్టిఫికేట్లు తమతో తీసుకురావాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థుల ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన చిరునామా ఇలా ఉంది.
ఎన్‌పీసీసీ లిమిటెడ్, ఇంటినెంబర్ 201 & 202,
మిట్టల్ అవెన్యూ, టాటా మోటార్స్ వెనుక
మాగ్నెటో మాల్ సమీపంలో, లాభాంధీ,
రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్- 492001

ఇంటర్వ్యూకు హాజరు కావాలనుకునే అభ్యర్థులను మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు అంతా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో కూడా కంపెనీ అన్ని కోవిడ్ నిబంధనలను పాటిస్తుందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+