DSC: రేపట్నుంచి డీఎస్సీ అప్లికషన్లు, టీఆర్టీ రోస్టర్ విడుదల: నెల రోజులే గడువు
హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల(DSC-2023)కు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా 33 జిల్లాల వారీగా టీచర్ పోస్టులకు విద్యాశాఖ రోస్టర్ ఖాళీలను విడుదల చేసింది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, మున్సిపల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు (SA), (SGT), భాషా పండితులు (Pandit), వ్యాయామ ఉపాధ్యాయ (PET) ఉద్యోగాలు ఉన్నాయి.
వీటికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభం అవుతుంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 21న ముగియనుంది. పరీక్షను నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 5089
స్కూల్ అసిస్టెంట్ 1739
లాంగ్వేజ్ పండిట్ 611
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 164
సెకండరీ గ్రేడ్ టీచర్ 2575
అప్లికేషన్ ఫీజు: రూ.1000
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 20
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 21
ఆన్‌లైన్ రాత పరీక్ష: నవంబర్ 20 నుంచి 30 వరకు
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications