తెలంగాణ గ్రూప్-2 పరీక్ష తేదీలు ఖరారు: ఎప్పుడంటే?

హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌-2 నియామక పరీక్ష తేదీలు ఖరారయ్యాయు. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) వెల్లడించింది. ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నైజేషన్‌ (ఓఎంఆర్‌) పద్ధతిలోనే పరీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు త్వరలో విడుదల చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

780కిపైగా గ్రూప్‌ 2 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో ఉద్యోగానికి గరిష్ఠంగా 705 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్షలు జరగనున్నందున ఈ రెండు తేదీల్లో పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని విద్యాసంవత్సరాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

tspscgroup3exams

ఇరిగేషన్‌కు 5,950 మంది వీఆర్‌ఏలు: లష్కర్లుగా

రెవెన్యూ శాఖలోని 21 వేల మందికిపైగా ఉన్న వీఆర్‌ఏ (విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌)ల నుంచి దాదాపు 5,950 మందిని నీటిపారుదల శాఖలో సర్దుబాటు చేసేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేస్తోంది. వీఆర్‌ఏలను నీటిపారుదల శాఖలో లష్కర్లుగా నియమించి, పే స్కేల్‌ వర్తింపజేయాలని ఆ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో భారీగా నిర్మిచిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో వీఆర్‌ఏల సేవలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

నీరు వృథా పోకుండా ఇప్పటికే టెయిల్‌ ఎండ్‌, వారబంది విధానాలతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణానికి సాగులోకి తెచ్చేందుకు విజయవంతంగా కృషి చేస్తోంది. ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణకు సాగునీటి పారుదల శాఖను పునర్‌ వ్యవస్థీకరించింది. అందులో భాగంగా ఆపరేషన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాన్ని ఏర్పాటుచేసి ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ను కూడా నియమించింది. ఇప్పుడు ఆ విభాగం ప్రాజెక్టుల నిర్వహణకు లష్కర్లను నియమించాలని నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+