మోదీకి నెతన్యాహు సీక్రెట్ కాల్.. అగ్రనేతల మైండ్ గేమ్..

పశ్చిమాసియా ప్రాంతంలో భౌగోళిక రాజకీయాలు, భద్రతా పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్న వేళ ప్రపంచ దృష్టిని ఆకర్షించే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా ఫోన్ చేశారు.

అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు, భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో.. ఇద్దరు అగ్రనేతల మధ్య జరిగిన ఈ సంభాషణ తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులు, యుద్ధ మేఘాల మధ్య ప్రాంతీయ శాంతిభద్రతలతో పాటు భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు.

PM Modi Receives Phone Call From Benjamin Netanyahu Discusses West Asia Tensions and Strategic Ties

వ్యూహాత్మక భాగస్వామ్యంపై రివ్యూ..

ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన వివరాలను భారత ప్రధాని కార్యాలయం (PMO) అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. భారత్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' సాధించిన పురోగతిని ఇద్దరు నేతలు చర్చించుకున్నారు.

PM Modi: ఐదేళ్లలో 550 కోట్లు.. మోదీ విదేశీ టూర్ల ఖర్చు బయటపెట్టిన కేంద్రం
PM Modi: ఐదేళ్లలో 550 కోట్లు.. మోదీ విదేశీ టూర్ల ఖర్చు బయటపెట్టిన కేంద్రం

రక్షణ, వ్యవసాయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, నీటి యాజమాన్యం, సైబర్ సెక్యూరిటీ, ద్వైపాక్షిక వాణిజ్య రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించాలని నిశ్చయించుకున్నారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తామని ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు.

పశ్చిమాసియా సంక్షోభంపై చర్చ..

పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై నెతన్యాహు, మోదీ తమ తమ దృక్పథాలను పంచుకున్నారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పునరుద్ధరణ, దౌత్యపరమైన మార్గాలు, భద్రతా సవాళ్లపై ఇరుపక్షాలు లోతుగా మాట్లాడాయి.

డొనాల్డ్ ట్రంప్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!
డొనాల్డ్ ట్రంప్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

దౌత్యపరమైన రహస్యాల దృష్ట్యా సంభాషణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం బయటపెట్టకపోయినప్పటికీ, ప్రాంతీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ, భవిష్యత్తులోనూ ఇద్దరూ నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని అంగీకారానికి వచ్చినట్లు పీఎంవో స్పష్టం చేసింది. న్యూఢిల్లీ - టెల్ అవీవ్ మధ్య ఉన్న బలమైన దౌత్య సంబంధాలకు ఈ ఫోన్ సంభాషణ మరొక తార్కాణంగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+