అమెరికా స్థావరాలపై దాడులు చేయమని హౌతీలు అంగీకరించారు : ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం వెస్ట్ ఏసియాలో పరిస్థితులు తీవ్రతరంగా మారిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియాపై యెమెన్ లోని హౌతీ దళాలు దాడులకు పాల్పడుతున్నాయి. హౌతీలకు ఇరాన్ సపోర్ట్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే హౌతీలపై దాడులు జరపాలని ఇటీవల సౌదీ అరేబియా అమెరికాను అభ్యర్థించింది. కానీ అమెరికా సౌదీ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హౌతీలు అమెరికా స్థావరాలపై దాడులు చేయబోమని తెలిపారని అన్నారు. ట్రే ఇంగెస్ట్ అనే 80 ఏళ్ల రిపబ్లికన్ నేత ఈ మేరకు మాట్లాడుతూ.. అమెరికా హౌతీలతో నిరంతరం చర్చలు చేస్తోందని వివరించారు. అమెరికాలో దాడులు చేయమని హౌతీలు అంగీకరించారని తెలిపారు.
ఇక హౌతీల అంశంపై గత 10 రోజుల్లో ట్రంప్ మాట్లాడటం ఇది రెండోసారి. ఇటీవల సెప్టెంబర్ 12 న ఐర్లాండ్ పర్యటనలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాపై దాడులు చేయమని.. అమెరికాతో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని హౌతీ దళాలు తెలిపాయని అన్నారు. మరోవైపు కష్టకాలంలో ఉన్న సౌదీ అరేబియాకు ట్రంప్ అధికార యంత్రాంగం దాదాపు 24.3 బిలియన్ డాలర్ల విలువైన 48 ఎఫ్-35 ఫైటర్ జెట్స్ కు విక్రయించేందుకు సిద్ధం అయింది. ప్రస్తుత పరిస్థితుల నుంచి ఆ దేశాన్ని బయట పడేసేందుకు అమెరికా ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు సౌదీ అరేబియాపై హౌతీలు భీకర దాడులు చేస్తున్నాయి. ఇటీవల సౌదీ అరేబియా రియాద్ లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో హౌతీలు డ్రోన్ దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. డ్రోన్ దాడులతో ఎయిర్ పోర్ట్ మొత్తం దట్టమైన పొగ వ్యాప్తి చెందింది. దాంతో అక్కడ విమాన సేవలు నిలిచిపోయాయి. అలాగే పాకిస్థాన్, టర్కీ దేశాలకూ హౌతీలు వార్నింగ్ ఇచ్చాయి. సౌదీ అరేబియాకు సపోర్ట్ చేస్తే పాకిస్థాన్, టర్కీపైనా దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ మేరకు యెమెన్- సౌదీ అరేబియా యుద్ధానికి ఆ దేశాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హెచ్చరించాయి.












Click it and Unblock the Notifications
