Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌజ్ నుంచి యాక్టర్ కృష్ణుడు ఎలిమినేట్
తెలుగు బిగ్ బాస్ సీజన్- 10 సెప్టెంబర్ 6 న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 10 నుంచి తొలి ఎలిమినేషన్ అనౌన్స్ చేశారు. ఆడియన్స్ ఓట్ల పరంగా చూసుకుంటే యాక్టర్ కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. గేమ్ పై ఆసక్తి చూపించకపోవడం అలాగే టాస్కుల్లో యాక్టివ్ గా పాల్గొనకపోవడం వంటివి కారణాలుగా పేర్కొన్నట్లు సమాచారం. హౌజ్ లో ఇతర కంటెస్టెంట్స్ తమ అభిప్రాయాలను బలంగా చెబుతుండగా కృష్ణుడు మాత్రం ఎక్కువగా సైలెంట్ గా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తాయి. అటు కృష్ణుడు ఆటతీరుపై నిన్న నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ మేరకు రెండో వారం నామినేషన్స్ లో త్రిగుణ్, రోహిత్ నాయుడు, ముఖేశ్ గౌడ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ మోదక్, శాలిని, ఝాన్సీ, సృష్టి వ్యాకరణం, సుధీర్ రెడ్డి, వర్షిణి, కృష్ణుడు ఉన్నారు. అయితే వీరిలో కృష్ణుడు, వర్షిణి తక్కువ ఓటింగ్ లో ఉన్నట్లు పలు సోషల్ మీడియా వేదికల ద్వారా స్పష్టం అవుతోంది. ఈ క్రమంలోనే ఈ వారం కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు ఆడియెన్స్ ఓట్ల పరంగా నాగార్జున వెల్లడించారు.
ఇక కృష్ణుడు ఎలిమినేషన్ తో పాటు రెండు వారాల్లో అతడి రెమ్యూనరేషన్ పైనా సోషల్ మీడియాలో పలు కథనాలు వెల్లడవుతున్నాయి. అయితే అనధికారిక సమాచారం ప్రకారం ఆయనకు వారానికి సుమారు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పారితోషికం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే హౌజ్ లో రెండు వారాలు కొనసాగితే సుమారు రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే కృష్ణుడి అసలు రెమ్యూనరేషన్ పై అటు బిగ్ బాస్ వర్గాలు కానీ ఇటు కృష్ణుడు కానీ అధికారికంగా వెల్లడించలేదు.

ఇక నటుడు కృష్ణుడు 2008 లో వినాయకుడు అనే సినిమాలో హీరోగా నటించారు. ఈ చిత్రానికి సాయి కిరణ్ అడివి దర్శకత్వం వహించారు. అలాగే 2009 లో దానికి సీక్వెల్ గా విలేజ్ లో వినాయకుడు సినిమాలో నటించారు. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసి మెప్పించారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
