MYSAA Teaser Review: 'మైసా' టీజర్ రివ్యూ.. ఆ నరుకుడేంది అక్కా..!

నేషనల్ క్రష్ రష్మిక 'మైసా' మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూస్తుంటే మాటల్లేవ్.. మాట్లాడుకోటాల్లేవ్.. ఊచకోతే అన్నట్లుగా ఉంది. గూస్ బంప్స్ అనే ది చిన్నపదం అనేంతలా రష్మిక నట విశ్వరూపం ప్రదర్శించింది. స్క్రీన్ పై మైసమ్మ తల్లి పూనినట్లుగా విలన్స్ ను నరుకుతుంటే థియేటర్ల పరిస్థితి ఏంటో అని అనుమానం కలుగుతుంది. ఈ టీజ‌ర్‌ లో ర‌ష్మిక లుక్‌, ఆమె యాక్ష‌న్ సీక్వెన్స్‌ ల గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు. ప్యూర్ గూస్ బంప్స్ స్టఫ్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి ర‌వీంద్ర పుల్లే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ న‌వంబ‌ర్ 27న రిలీజ్ కాబోతుంది.

MYSAA starring National Crush Rashmika has just been released The teaser is absolutely explosive

అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను.. అనే డైలాగ్ తో రష్మిక మందాన్న మైసా టీజర్ స్టార్ట్ అవుతుంది. మైసా.. మైసా మెస్రమ్.. బయట అంతమంది జనం.. ఒక్క అమ్మాయి.. నీకింకా అర్థం కావట్లేదు.. యుద్ధానికి ఆయుధం అంటే భయం కానీ.. ఆయుధం ఏ యుద్ధానికి బయపడదు.. షీ ఈజ్ ది బ్లడీ వెపన్.. వూ డిసైడ్స్ ది వార్.. అనే డైలాగ్స్ టీజర్ లో ఉన్నాయి. చివర్లో చావు నుండైనా నీకోసం వస్తాను నాన్నా.. అనే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. టీజర్ ఫస్ట్ నుంచి ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్​ తో ఇంట్రెస్టింగ్ గా ఉంది. గతంలో అనుష్క చేసిన గాటి, సమంత మా ఇంటి బంగారం కంటే రష్మిక మైసా సినిమా చాలా రస్టిక్ గా ఉంది.

మైసా టీజర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆ నరుకేంది అక్కా అంటూ మరికొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి టీజర్ తో రష్మిక ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. మైసా మూవీలో రాహుల్ రవీంద్రన్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని అన్ ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్​ పై అనిల్, అజయ్ సయ్యపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+