తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జనవరి 2 నుంచి 20 వరకు జరిగిన టెట్ పరీక్షలకు 1,35,802 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 42,384 (31.21 శాతం) మంది అర్హత సాధించారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.పేపర్ 1లో 59.48 శాతం, పేపర్ 2లో 31.21 శాతం అభ్యర్థులు ఉత్తీర్థత సాధించినట్లు పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ యోగితా రానా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు.

ఇది ఇలావుండగా, తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూలును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇటీవల ఖరారు చేసింది. మార్చి 12న పీజీ ఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపింది. జూన్‌ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్‌ పరీక్షలు జరగనున్నాయి.

Telangana TET results released

మరోవైపు, తెలంగాణ ఈఏపీ సెట్ షెడ్యూల్‌ని ఉన్నత విద్యామండలి ఇటీవల ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ని వెల్లడించింది. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఈఏపీ సెట్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నతా విద్యామండలి ప్రకటించింది. ఈఏపీ సెట్ పరీక్షలు జేఎన్టీయూ నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+