"కూలీ" విలన్ రోల్ పై రజినీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్..!!
హైదరాబాద్: దక్షిణాది సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 'కూలీ' చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా, హైదరాబాద్‌లో జరిగిన చిత్ర ప్రెస్‌మీట్‌లో సూపర్‌స్టార్ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా, ఇందులో విలన్‌గా నటించిన కింగ్ నాగార్జున గురించి రజినీకాంత్ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఆ పాత్ర నాకే కావాలనిపించింది.. కానీ!
కూలీ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కథను చెప్పేటప్పుడు, అందులోని సైమన్ అనే విలన్ పాత్ర గురించి వివరించారట.సైమన్ క్యారెక్టర్ గురించి డైరెక్టర్ లోకేష్ చెప్పగానే తాను ఎంతగానో ప్రభావితమైనట్లు రజినీ చెప్పుకొచ్చారు. నిజానికి ఆ పాత్ర తనకే కావాలని వెంటనే ఆవిషయం చెప్పినట్లు వెల్లడించారు రజినీకాంత్ గుర్తు చేసుకున్నారు. అయితే, దర్శకుడు లోకేష్ ఆ పాత్ర కోసం నాగార్జునను అనుకుంటున్నానని చెప్పినప్పుడు తాను ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. "నాగార్జున ఒప్పుకుంటారా అని నేను సందేహం వ్యక్తం చేశాను. కానీ, లోకేష్ చాలా నమ్మకంగా 'ఎలాగైనా ఆయన్ను ఒప్పిస్తాను' అని హామీ ఇచ్చారు" అని రజినీకాంత్ చెప్పారు.

33 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేరింగ్.. నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!
దాదాపు 33 ఏళ్ల తర్వాత 'కూలీ' సినిమాతో నాగార్జునతో కలిసి స్క్రీన్ పంచుకోవడంపై రజినీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు. నాగార్జున అద్భుతమైన ఫిట్‌నెస్‌ను చూసి తాను ముగ్ధుడైనట్లు చెప్పారు. "ఇన్నేళ్ల తర్వాత కూడా నాగార్జునను చూస్తే, ఆయన అప్పటిలాగే చాలా ఫిట్‌గా, యంగ్‌గా కనిపిస్తున్నారు"అని రజినీకాంత్ ప్రశంసించారు. ఆయన ఫిట్‌నెస్ రహస్యం ఏమిటని తాను అడగ్గా, అందుకు నాగార్జున నవ్వుతూ "రోజూ చేసే క్రమం తప్పని వ్యాయామం, కఠినమైన ఆహార నియమాలు, అలాగే మా నాన్నగారి నుంచి వచ్చిన మంచి జీన్స్" అని సమాధానం చెప్పారని రజినీకాంత్ తెలిపారు.
సైమన్ పాత్రలో నాగార్జున అద్భుతం.. నేనైతే చేయలేకపోయేవాడిని
నాగార్జున నటనపై రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. "సైమన్ పాత్రలో నాగార్జున అద్భుతంగా నటించారు. నిజం చెప్పాలంటే, ఆ పాత్రను నాగార్జున చేసినంత గొప్పగా నేను చేయలేకపోయేవాడిని" అని రజినీకాంత్ ప్రశంసించారు. ఇద్దరు దిగ్గజ నటుల మధ్య ఉన్న పరస్పర గౌరవం, వారి నటనా నైపుణ్యాల పట్ల ఉన్న అభిమానం ఈ మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఈ అద్భుతమైన కాంబినేషన్‌తో వస్తున్న 'కూలీ' సినిమా కోసం అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే కింగ్ నాగార్జున ధనుష్ కాంబినేషన్‌లో ఈ మధ్యే వచ్చిన కుబేరా చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దీంతో కూలీ మూవీపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. అందునా రజినీకాంత్‌తో పాటు నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఈ చిత్రానికి మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది వేరే లెవెల్‌లో ఉంటుందని మూవీ లవర్స్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications