భారత్‌కు అమెరికా బిగ్ షాక్: ట్రంప్ సర్కారు కొత్త వ్యూహం!
రష్యా దేశం నుంచి ముడిచమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలపై కఠిన ఆంక్షలు విధించేలా రూపొందించిన సరికొత్త చట్టానికి అమెరికాకు చెందిన నలుగురు సెనేటర్లు ట్రంప్ సర్కారుతో ఓ ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని సెనేటర్లు శుక్రవారం ప్రకటింటారు. ఈ మొత్తం పరిణామంతో ఇండియాకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఎందుకంటే భారత్ కూడా రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం 5వ ఏడాదికి చేరిన నేపథ్యంలో పుతిన్ సైనిక చర్యలకు ఆర్థికంగా అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ట్రంప్ సర్కారు ఈ అడుగు వేస్తోంది.
కుదిరిన ఒప్పందం
అమెరికాకు చెందిన నలుగురు సెనేటర్లు రిచర్డ్ బ్లూమెంథల్, లిండ్సే గ్రాహం, జీన్ షాహీన్, రోజర్ వికర్ లు శుక్రవారం సంయుక్తంగా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. రష్యా దేశంపై మరిన్న కఠిన ఆంక్షలు విధించేలా రూపొందించిన ఈ బిల్లును ట్రంప్ సర్కారు కూడా అంగీకరించిందని సెనేటర్లు వెల్లడించారు. రష్యా పౌరులను పొట్టనబెట్టుకుంటున్న వేళ.. ఆ దేశంతో వ్యాపారం చేస్తూ పరోక్షంగా రష్యాకు నిధులు సమకూరుస్తున్న దేశాలు దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సెనేటర్లు స్పష్టం చేశారు. ఈ చట్టం త్వరలోనే అమల్లోకి రానున్నట్లు వారు వెల్లడించారు.

జెలెన్స్కీతో సమావేశం
ఇటీవల ఉక్రెయిన్‌లోని కీవ్‌లో సెనేటర్ లిండ్సే గ్రాహం ఆ దేశ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఒప్పందం వల్ల చట్టాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చని, ప్రస్తుతం ఐదవ సంవత్సరంలో ఉన్న యుద్ధాన్ని ముగించడానికి డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త సాధనాలు లభిస్తాయని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యాపై అంతర్జాతీయంగా ఆంక్షలు విధించడం వల్లే దౌత్యపరమైన చర్చలు విజయవంతం అవుతాయని జెలెన్స్కీ అన్నారు.
రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై ఆంక్షల నిబంధన
ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో రష్యా విఫలమైనందున, ఈ చట్టం రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై, రష్యా ఇంధన ఎగుమతుల కొనుగోలుదారులపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. గ్రాహం తన తోటి రిపబ్లికన్లు, డెమోక్రాట్లతో కలిసి నెలల తరబడి దీనిపై పనిచేస్తున్నారు. ఇరాన్‌పై సైనిక దాడులు మళ్లీ మొదలవడంతో చమురు ధరలపై ప్రపంచంవ్యాప్తంగా ఇప్పటికే ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో అమెరికా తీసుకుంటున్న ఈ కీలక నిర్ణయం అంతర్జాతీయ ఇంధన మార్కెట్ ప్రభావితం కానుంది. గత నెలలో సముద్ర మార్గం ద్వారా రష్యా చమురును కొనుగోలు చేయడానికి దేశాలకు అనుమతినిచ్చే లైసెన్స్ ముగిసిపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది.
భారత్‌పై ప్రభావం
అమెరికా తీసుకొస్తున్న ఈ కఠిన చట్టం ఇండియాకు ఓ సవాలుగా మారనుంది. ప్రస్తుతం రష్యా నుంచి అధికంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే భారత్ రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను నిలిపేయాల్సి ఉంటుంది. ఒకవేళ కొనుగోళ్లను కొనసాగిస్తే.. అమెరికా నుంచి భారీ టారిఫ్ లు , ఆర్థిక ఆంక్షలను భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications