డబుల్ చిన్ తగ్గించటానికి నేచురల్ టిప్స్.. ట్రై చేసి చూడండి!

మన ముఖాకృతి అందంగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. కానీ ముఖ ఆకృతిలో మన గడ్డం కీలక భూమిక పోషిస్తుంది అన్న విషయం చాలామంది గుర్తించం. గడ్డం కింద పేరుకుపోయిన అదనపు కొవ్వు మన ముఖ అందాన్ని దెబ్బతీస్తుంది. గడ్డం కింద అదనపు కొవ్వు పేరుకు పోవడాన్ని డబుల్ చిన్ అంటారు. ఈ డబుల్ చిన్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది.

బరువు ఎక్కువ ఉంటే డబుల్ చిన్ సమస్య

దీనివల్ల ముఖానికి ఉన్న ఆకర్షణ తగ్గిపోతుంది. అయితే ఈ సమస్య ఏ విధంగా తగ్గుతుంది? డబుల్ చిన్ ను నేచురల్ గా ఎలా తగ్గించుకోవచ్చు? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. డబుల్ చిన్ రావడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి. ఒకటి అధిక బరువు. అకస్మాత్తుగా బరువు పెరిగినప్పుడు గడ్డం దగ్గర కొవ్వు పేరుకుపోయి డబుల్ చిన్ వస్తుంది. ఒకవేళ బరువు తగ్గితే అక్కడి చర్మం వదులుగా మారి ఇబ్బందికరంగా కనిపిస్తుంది.

double chin reducing natural tips causes for double chin home remedies to reduce double chin

ఈ కారణాలతోనూ డబుల్ చిన్

డబుల్ చిన్ రావడానికి రెండవ కారణం జన్యుపరమైనవి. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వంశపారంపర్యంగా కూడా ఇది వస్తుంది. ఇక మూడవ కారణం వయస్సు. వయసు పెరిగే కొద్దీ ముఖ కండరాలు బలహీనపడి చర్మం వదులై గడ్డం కింద కొవ్వు పేరుకుపోతుంది. అయితే ఈ ప్రధానంగా ఈ మూడు సమస్యలతో డబులు చిన్ వస్తుంది. మరి దీనిని న్యాచురల్ గా తగ్గించుకోవడానికి పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం.

డబుల్ చిన్ తగ్గాలంటే ఇలా చెయ్యండి

ఆహార నియమాలను పాటించడం ద్వారా, వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు. ముఖ్యంగా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం మానుకోవాలి. ఇక డబుల్ చిన్ తగ్గాలి అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే వేరుశనగ, సబ్జా గింజలు, పొట్టు తక్కువ తీసిన ధాన్యాలు తీసుకుంటే మంచిది.

ఈ ప్యాక్ తో డబుల్ చిన్ కాస్త టైట్ అవుతుంది

ఇక ఆహారం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. బాగా నమిలి మింగడం వల్ల ముఖ కండరాలకు వ్యాయామం జరుగుతుంది. ముఖ కండరాల వ్యాయామం డబుల్ చిన్ తగ్గించాలి అంటే షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ కూడా దీనికి ఉపయోగపడుతుంది. ఇక కోడిగుడ్డు తెల్లసొన ప్యాక్ వేసుకుంటే కూడా డబుల్ చిన్ కాస్త టైట్ అవుతుంది.

ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్

రెండు కోడిగుడ్డు తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ పాలు, కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి డబుల్ చిన్ ఉన్నచోట వస్తే అక్కడ స్కిన్ టైట్ అవుతుంది. ప్రతిరోజు ఇలా 20 నుండి 30 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని అక్కడ పట్టించి ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

పెసరపప్పుతో అశోకా హల్వా.. ఇది తింటే మీలో శక్తి డబుల్!
పెసరపప్పుతో అశోకా హల్వా.. ఇది తింటే మీలో శక్తి డబుల్!

ఈ ఇంటి చిట్కాలతో డబుల్ చిన్ కు చెక్

గ్రీన్ టీ తాగడం కూడా చెడు కొవ్వును కరిగిస్తుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అంతేకాదు మెడకు సంబంధించి కిందికి మీదికి కదిలిస్తూ చేసే చిన్న వ్యాయామాలు కూడా డబుల్ చిన్ తగ్గిస్తాయి. ఇక్కడ డబుల్ చిన్ సమస్య నుండి విముక్తి పొందాలంటే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ సింపుల్ చిట్కాలు క్రమం తప్పకుండా పాటిస్తే డబుల్ చిన్ సమస్య చాలావరకు తగ్గుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+