ఆ దేశానికి వెళ్లొద్దు, ఖర్చు పెట్టొద్దు - ఎందుకో తెలుసుకోండి !
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ సోషల్ మీడియా వేదికగా ఓ దేశంపై నిప్పులు చెరిగారు. విహార యాత్రలకు ఇకపై ఆ దేశానికి వెళ్లొద్దని.. ఇన్నాళ్లు వారికి టూరిజం పేరుతో ఆ దేశంలో బిలియన్ డాలర్లు చేస్తుంటే.. వారు ఈ తరహాగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి దేశాలకు భారతీయులు వెళ్లాల్సిన అవసరం లేదని హితవు పలికారు. దీంతో ఈ పోస్ట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
టర్కీ దేశంపై ఫైర్..
ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు, వారి స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా "ఆపరేషన్ సిందూర్ " చేపట్టింది భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు మృతి చెందడం, పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగడం.. భారత్ తిరిగి సరైన రీతిలో బుద్ది చెప్పడం జరిగింది. ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో పాక్‌కు మద్దతుగా టర్కీ నిలిచింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఎర్డోగాన్ కలిసి వారితో సత్సంబంధాలు కొనసాగిస్తామని టర్కీ ప్రెసిడెంట్ ఎర్గోడాన్ తెలిపారు.

పాకిస్థాన్ కి వత్తాసు పలకడమే కాకుండా పహల్గాం ఉగ్రదాడిని ఖండించకపోవడం గమనార్హం. మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు పట్ల కూడా సానుభూతి వ్యక్తం చేయకపోయవడం విమర్శలకు దారి తీసింది. దీనిపై హీరో నిఖిల్ ఫైరయ్యారు. ఇకపై ఎవరూ కూడా టర్కీని సందర్శించవద్దని భారతీయులను కోరారు. టర్కీలో భారతీయులు ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారని వ్యాఖ్యానించారు.
భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం ఇకపై డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు నిఖిల్. విహారయాత్రల కోసం అలాంటి దేశాలకు వెళ్లొద్దని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ విదేకగా ఇది చదవండి అంటూ ఓ ఆర్టికల్ ని సైతం షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన దేశాల్లో టర్కీ, చైనా ఉన్నాయి. ఇప్పటికే టర్కీ యాపిల్స్‌ను సైతం దిగుమతి చేయడాన్ని భారత ప్రభుత్వం ఆపేసింది.
Anyone still visiting Turkey ? Please read this Below Thread...
— Nikhil Siddhartha (@actor_Nikhil) May 14, 2025
Indians Spend Billions of Dollars Every year in Turkey.
Please Stop giving your money to the Nations who are against us. #Tourism #India https://t.co/hUGq6MP6Pm
మరోవైపు నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో "స్వయంభూ" మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేస్తుండగా.. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications