హనీమూన్ కోసం ఎదురుచూస్తున్న.. త్రిష షాకింగ్ పోస్ట్ !!
త్రిష.. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ దూసుకుపోతుంది. నాలుగు పదుల వయసు దాటినా కూడా అందంతో హృదయాలను కొల్లగొడుతుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో కూడా నటించి మెప్పించింది. ఇక మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ భామ.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరోసారి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే థగ్ లైఫ్, ఐడెంటిటీ, విదాయమర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం త్రిష తమిళంలో కరుప్పు.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాల్లో నటిస్తుంది. అలానే విజయ్ సేతుపతితో 96 సీక్వెల్ లో నటించనుంది. అయితే సినీ వర్గాల్లో త్రిష పెళ్లి విషయం ఎప్పుడూ హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంటుంది.

గతంలో త్రిష ఎంగేజ్మెంట్ చేసుకొని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్నాళ్లగా పెళ్లై, పిల్లలున్న స్టార్ హీరోతో ఆమె రిలేషన్‌లో ఉన్నారంటూ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు త్రిష పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అయితే ఈ వ్యవహారంపై లేటెస్ట్ గా త్రిష సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యింది. ఈ భామ పోస్ట్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది.
ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. నా లైఫ్ గురించి వేరే వాళ్లు ప్లాన్ చేస్తుంటే నాకు చాలా ఇష్టం.. నా పెళ్లి గురించి ఫిక్స్ చేసినట్టే హనీమూన్ గురించి కూడా షెడ్యూల్ ఫిక్స్ చేస్తారని ఎదురు చూస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. ఈ సెటైర్‌తో తన పెళ్లి వార్తలకు ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చినట్టు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవితో కలిసి త్రిష నటిస్తున్న 'విశ్వంభర'చిత్రాన్ని వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. V క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. vfx కారణంగా సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది మూవీ రిలీజ్ కానుంది.












Click it and Unblock the Notifications