అల్లు అర్జున్ అభిమానులకు ఏడుపు ఒకటే తక్కువ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో హిట్ కొట్టారు. ఈ సినిమాకు రూ.1850 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కానీ ఫిలింనగర్ వర్గాలు మాత్రం రూ.1250 నుంచి రూ.1350 కోట్ల మధ్యలో వచ్చివుంటాయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పుష్ప2 సినిమాతో అల్లు అర్జున ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన తన తర్వాత సినిమాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయాలనుకున్నారు. అయితే పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి ఏడాదికిపైగా సమయం పడుతుండటంతో అట్లీ దర్శకత్వంలో చేయాలని అల్లు అర్జున్ నిర్ణయం తీసుకున్నారు.
ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు
అయితే అట్లీ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు సీజీ వర్క ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ దీన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రారంభమైందా? లేదంటే ప్రారంభం కాలేదా? సినిమా ఉందా? లేదా? అనే విషయాలు కూడా అధికారికంగా రాలేదు. గుంటూరు కారం తర్వాత ఏడాదిపాటు ఖాళీగా ఉన్న త్రివిక్రమ్ మైథలాజికల్ ఫాంటసీ సబ్జెక్టును అల్లు అర్జున్ కోసం ఎంచుకున్నారు. ఈ జోనర్ లో సినిమా చేయడం త్రివిక్రమ్ కు కూడా కొత్త. దీంతో స్క్రిప్ట్ సిద్ధం కావడం బాగా ఆలస్యం అవుతోంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో తెలియదు.

ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు
అట్లీ దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అర్థం కాకుండా ఉంది. పుష్ప2 విడుదలైన తర్వాత ఆరునెలలకు పైగా అల్లు అర్జున్ ఖాళీగా ఉన్నాడు. ఇంకా ఎన్ని నెలలు ఖాళీగా ఉంటాడో తెలియదు. వేరే దర్శకుల కథలు ఏమైనా వింటున్నాడా? అనే సమాచారం కూడా లేదు. ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ అభిమానులు విపరీతంగా బాధపడిపోతున్నారు. తమ హీరో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ కొడితే ఇంతవరకు ఆ ఆనందం నిలవలేదని, తర్వాత సినిమా ఏది? అనే విషయంలో స్పష్టత రావడంలేదని, తెరమీద చూడటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అంటూ నిరాశకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications