అల్లు అర్జున్‌ను పవన్ కల్యాణ్ అవమానించాడు?
ప్రస్తుతం అల్లు అర్జున్ కు, మెగా కుటుంబానికి మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీటిపై నిర్మాత బన్నీ వాసు కూడా స్పందించారు. కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న వివాదాలు రావడం సహజమేనని, అయితే వాటిని పెద్దవిగా చేసి చూపించడం మాత్రం సరైన చర్య అవదన్నారు. చిన్నవైనా, పెద్దవైనా విభేదాలు మాత్రం ఉన్నాయనే విషయాన్ని బన్నీ వాసు స్పష్టం చేశాడు. అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీవ్రస్థాయికి దారితీశాయి.
అవమానించాడని ఫీలైన బన్నీ అభిమానులు
పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ కు కేవలం ట్వీట్ ద్వారా మద్దతు తెలియజేసిన అల్లు అర్జున్ నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీచేస్తున్న తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి దగ్గరకు స్వయంగా వెళ్లి మద్దతు ఇవ్వడంతోపాటు చిన్నపాటి ర్యాలీలో పాల్గొన్నారు. అప్పటినుంచి పవన్ కల్యాణ్ అభిమానులకు, అల్లు అర్జున్ కు మధ్య ఉన్న విభేదాలు తీవ్రమయ్యాయి. వాస్తవానికి బన్నీకి పుష్ప చిత్రంలో నటించినప్పుడు జాతీయ అవార్డు వచ్చింది. ఆ సమయంలో అందరూ అభినందనలు తెలియజేసినప్పటికీ పవన్ కల్యాణ్ మాత్రం తూతూమంత్రంగా ట్వీట్ చేసి సరిపెట్టాడని, పవన్ బన్నీని అవమానించాడంటూ అల్లు అర్జున్ అభిమానులు బాగా ఫీలయ్యారు.

అందుకే నామ మాత్రంగా బన్నీ ట్వీట్లు
అందుకనే బన్నీ కూడా పిఠాపురం ఎన్నికల సమయంలో, గెలిచిన తర్వాత కూడా నామ మాత్రంగా ట్వీట్లు చేసి సరిపెట్టాడని అంటున్నారు. అయితే అంతకుముందే రామ్ చరణ్ కు, అల్లు అర్జున్ కు కూడా విభేదాలున్నాయి. ఈ విభేదాలు కొనసాగుతున్న తరుణంలోనే పవన్ కల్యాణ్ వివాదం రేకెత్తింది. దీనివల్లే ప్రస్తుతం వచ్చే నెల 15వ తేదీన విడుదల కావాల్సిన పుష్ప2 విడుదల వాయిదా పడింది. గతంలో పవన్ కల్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అని వ్యాఖ్యానించినందుకు బన్నీ సినిమా నాపేరు సూర్య, నా ఇల్లు ఇండియాను మెగా అభిమానులు ఫ్లాప్ చేశారు. ఎవరూ ఈ సినిమా చూడటానికి వెళ్లలేదు. ఇప్పుడు పుష్ప2 సినిమాను డిసెంబరు ఆరోతేదీన విడుదల చేస్తున్నప్పటికీ దీన్ని చూడటానికి మెగా అభిమానులు నిరాకరిస్తున్నారు. దీని ఫలితం ఎలా వస్తుందో చూడాలని విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications