విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన మరో స్టార్ కపుల్..!
సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. సెలబ్రిటీలు ఎంత వేగంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారో అంతే వేగంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే సినీ తారలు ఎక్కువైపోతున్నారు. ఏ రోజు ఎవరు విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు.
తాజాగా మరో జంట విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్ , అతని భార్య ఐశ్వర్య విడాకులకు రెడీ అయ్యారు. ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఆ మధ్య విడాకుల విషయంలో ఇద్దరూ పునరాలోచనలో పడ్డారని, కలిసి ఉండటానికే వీరు నిర్ణయించుకున్నారని మాటలు వినిపించాయి. అయితే తాజాగా అలాంటిది ఏమీ లేదని తెలుస్తోంది. ధనుష్ , ఐశ్వర్య ఇద్దరూ కూడా విడాకులు తీసుకోవడానికే మొగ్గు చూపారు. కేసు విచారణలో భాగంగా వీరిద్దరు తాజాగా చెన్నై ఫ్యామిలీ కోర్టు ఎదుట హాజరయ్యారు.

విచారణలో భాగంగా తాము కలిసి ఉండాలనుకోవడం లేదని.. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలియజేశారు. అలాగే.. వారు విడిపోవడానికి గల కారణాలను న్యాయస్థానానికి తెలిపారు. ఇరువురి వాదనలు విన్న చెన్నై ఫ్యామిలీ కోర్టు ఫైనల్ తీర్పును ఈ నెల 27కి వాయిదా వేసింది. విడాకుల విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రంగంలో దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ధనుష్ , ఐశ్వర్యల వైవాహిక జీవితానికి త్వరలోనే తెరపడనుంది. వీరికి ఇద్దరు కుమారులు.












Click it and Unblock the Notifications