మహేష్‌బాబు విషయంలో బాగా హర్ట్ అయిన రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.1500 కోట్ల బడ్జెట్ తో ప్రపంచస్థాయి నాణ్యతతో పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహేష్ బాబు తొలిసారిగా రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది చివరకు లేదంటే 2027లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే రెండు భాగాలుగా సినిమా వస్తుందంటున్నారు. ఎంతోమంది హీరోలు రాజమౌళి దర్శకత్వంలో చేయడానికి ఎదురుచూస్తుంటారు. కానీ ఇప్పుడు మహేష్ బాబుకు ఆ అవకాశం దక్కింది.

అందుబాటులో లేకపోవడం ఆయనకు నచ్చలేదు
అయితే ప్రస్తుతం మహేష్ బాబు ఇటలీ వెళ్లి వచ్చారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరంగా గడిపేందుకు టూర్లకు వెళ్లే అలవాటు మహేష్ బాబుకు ఉంది. అయితే రాజమౌళి వెళ్లవద్దని చెప్పినప్పటికీ వినకుండా ఇటలీ వెళ్లి తాజాగా తిరిగి వచ్చేశాడు. తొందరగానే వచ్చేసినప్పటికీ రాజమౌళి మాత్రం ఈ విషయంలో బాగా హర్ట్ అయినట్లు సమాచారం. ఒక షెడ్యూల్ సినిమా పూర్తిచేసుకున్న తర్వాత రెండో షెడ్యూల్ ను ప్రారంభించడానికి రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో హీరో అందుబాటులో లేకుండా వెళ్లడం అనేది ఆయనకు నచ్చలేదని తెలుస్తోంది.

director Rajamouli is very hurt over Mahesh Babu s affair

హాలీవుడ్ స్థాయికి ఎదగాలి
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హాలీవుడ్ స్థాయికి ఎదగాలని ప్రిన్స్ అభిమానులంతా కోరుకుంటున్నారు. అయితే మహేష్ బాబు మాత్రం ఇలా చేయడం ఏమాత్రం నచ్చడంలేదని అభిమానులు కూడా అంటున్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు జపాన్ లో ఉన్నారు. అడవిలో యాక్షన్ అడ్వెంచర్ గా, థ్రిల్లర్ గా రాజమౌళి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. అప్పుడప్పుడు షూటింగ్ స్పాట్ లో ఫొటోలు మాత్రం లీకవుతున్నాయి. దీనిపై రాజమౌళి బాగా దృష్టిపెట్టి అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+