సుకుమార్ పిచ్చిగా ఇష్టపడే హీరో ఎవరో తెలుసా?
దర్శకుడు సుకుమార్ కు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంటుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా ఏ సన్నివేశాన్ని లాజిక్ లేకుండా తీయరు. సినిమా చూసే ప్రేక్షకుడు అందులో లాజిక్ గురించి ఆలోచించే అవకాశం ఇవ్వకూడదని, ప్రతి ఫ్రేము పర్ ఫెక్ట్ గా ఉండాలని ఆయన తపిస్తుంటారు. అందుకే దర్శకులకు సంబంధించి సుకుమార్ ను మిస్టర్ పర్ ఫెక్ట్ అని అభివర్ణిస్తుంటారు. ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన తన తదుపరి సినిమాలు ఎవరితో చేయనున్నారనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.
అటువంటి సుకుమార్ ఇష్టపడే హీరో ఎవరో తెలుసా?.. ఎవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు. పరిశ్రమలోకి రాకముందు సూపర్ స్టార్ కృష్ణ అంటే పిచ్చి అభిమానం. తర్వాత ఆ అభిమానం ప్రిన్స్ వైపు మళ్లింది. దర్శకుడిగా తన మొదటి సినిమా మహేష్ బాబుతోనే చేయాలని ప్రయత్నించారు. ఆర్య సినిమా కథను ప్రిన్స్ కే మొదటిగా వినిపించారు. అయితే వన్ సైడ్ లవ్ కావడంతో మహేష్ దాన్ని తిరస్కరించారు.

ఆ తర్వాత రంగస్థలం సినిమాకానీ, పుష్ప సినిమాకానీ ప్రిన్స్ తోనే తెరకెక్కాల్సి ఉంది. అయితే వీటిని కొన్ని కారణాలవల్ల మహేష్ బాబు తిరస్కరించాడు. మధ్యలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమా మాత్రం పరాజయం పాలైంది. సుకుమార్ తాను రాసుకునే ప్రతి కథను ముందుగా మహేష్ బాబును దృష్టిలో పెట్టుకొనే రాసుకుంటాడని, సన్నివేశాన్ని కూడా అలాగే అల్లుకుంటారని సుకుమార్ సన్నిహితులు చెబుతుంటారు.
అయితే ప్రతి కథ నచ్చాలని లేదు కాబట్టి కొన్ని కథలను ప్రిన్స్ తిరస్కరించినప్పటికీ సుకుమార్ ఎప్పుడూ నిరాశ పడలేదు. తన సనిమాలన్నీ ఎంతో సహజంగా ఉంటాయి. కథానాయకుల క్యారెక్టర్లు కూడా అంతే సహజంగా ఉంటాయి. వాటికి తాను సరిపోనని భావించే మహేష్ బాబు ఏ సినిమాకు ఎవరు బాగుంటారో ఆ హీరోల పేర్లను కూడా సుకుమార్ కు సూచిస్తుంటారు. అలా పుష్ప సినిమాకు కూడా అల్లు అర్జున్ ను సూచించారు. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ తో సినిమా ఉంటుందని ప్రిన్స్ అభిమానులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications