'కాంతార'ను మైమరపించే సినిమా వచ్చేసింది..!
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'డివైన్ ట్రెండ్' నడుస్తోంది. కార్తికేయ 2, కాంతార, హనుమాన్ వంటి చిత్రాలు మైథలాజికల్ టచ్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాయి. ఈ డివైన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌కు ఆడియెన్స్ అద్భుతంగా కనెక్ట్ అయ్యారు, ఫలితంగా ఆ చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ, కానీ అంతకుమించి.. ఇంతవరకు ఏ తెలుగు చిత్రం టచ్ చేయని అత్యంత లోతైన పాయింట్‌తో దర్శకుడు జయశంకర్ రూపొందించిన చిత్రం 'అరి'.
'పేపర్ బాయ్' దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జయశంకర్, మనిషిని బంధించే ఆరు అంతర్గత శక్తులైన అరిషడ్వర్గాలను (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) కాన్సెప్ట్‌గా తీసుకుని 'అరి' చిత్రాన్ని తెరకెక్కించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో చూపించిన పాయింట్, ఆరు విభిన్న పాత్రల ద్వారా సమాజానికి ఇచ్చిన సందేశం ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా, క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది.

'అరి' చిత్రం చివరి 20 నిమిషాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఈ ఎండింగ్‌లో శ్రీకృష్ణుడి ఎంట్రీ ఇవ్వడం, ఆయన అరిషడ్వర్గాల గురించి, మనిషి జీవితంలో వాటి ప్రభావం గురించి ఇచ్చే సందేశం.. అందరినీ ఆకట్టుకుంది. ఈ దృశ్యం సినిమాకు ఒక అద్భుతమైన, సందేశాత్మక ముగింపును ఇచ్చింది. ఈ క్లైమాక్స్ గురించి మీడియా, సోషల్ మీడియా, సినీ విమర్శకులు సైతం ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో 'అరి' చిత్రంపై పాజిటివ్ కామెంట్ల వర్షం కురుస్తోంది. అరిషడ్వర్గాల వంటి లోతైన ఆధ్యాత్మిక అంశాన్ని ప్రధానంగా తీసుకుని, ఆరు పాత్రలతో దర్శకుడు ఇచ్చిన బలమైన సందేశం ప్రేక్షకులను గుండెల్లోకి హత్తుకుంది. వినోద్ వర్మ, అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష వంటి నటీనటులు తమ పాత్రలతో సినిమాకు ప్రాణం పోశారు.
మొత్తంగా, దర్శకుడు జయశంకర్.. 'పేపర్ బాయ్' తర్వాత 'అరి'తో వరుసగా రెండు మంచి, వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి, తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. డివైన్ ట్రెండ్‌లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించిన 'అరి' చిత్రం తప్పక చూడవలసిన సందేశాత్మక చిత్రంగా నిలిచింది.












Click it and Unblock the Notifications