సమంతకు ఆ హీరో భార్య వార్నింగ్
హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాల్లో నటించడం తగ్గించేసింది. కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.
దీంతో కొంతకాలం సినిమాలకు దూరం ఉన్నారు. అయితే ఆరోగ్యం నయం కావడంతో తిరిగి సినిమాల్లో నటించిడానికి ఆమె రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగానే ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. దీంతో తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాకు సైతం సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తన ఆప్‌డేట్స్‌ను అభిమానుల ముందుంచుతుంది.

దీంతో పాటు తన హెల్త్‌కు సంబంధించిన విషయాలతో పాటు, తన ట్రీట్మెంట్‌కు సంబంధించిన విషయాలను సైతం తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తోంది. దీనిలో భాగంగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ నేబ్యులైజేషన్ వాడకంపై గురించి సమంత ఇచ్చిన సలహా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హైడ్రోజన్ పెరాక్సైడ్ నేబ్యులైజేషన్ వాడకం గురించి సమంత తప్పుగా చెబుతున్నారని..ఆమెను జైల్లో పెట్టాలని ఓ డాక్టర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
తాజాగా ఈ ఘటనపై బ్యాడ్మింటన్ ప్లేయర్, తమిళ హీరో విష్ణు విశాల్ భార్య గుత్తాజ్వాల రియాక్ట్ అయ్యారు. సమంత తీరుపై గుత్తాజ్వాల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గుత్తాజ్వాల స్పందిస్తూ..'జనాలకు హెల్త్ టిప్స్ ఇస్తున్న సెలబ్రిటీలను నేను ఒకే ఒక్క ప్రశ్న అడగదల్చుకున్నాను. మీ చికిత్సా విధానం అవతలివారికి ఉపయోగపడకపోగా చనిపోతే పరిస్థితేంటి? ఎదుటి వారికి సహాయం చేయాలన్న మీ ఆలోచన మంచిదే.. కాదనను.. కానీ జరగరానిది జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? మీకు సలహా ఇచ్చిన డాక్టర్ బాధ్యత తీసుకుంటారా?' అంటూ ట్విట్టర్ వేదికగా సమంతపై గుత్తాజ్వాల విమర్శలు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications