మహేష్‌బాబుతో పోటీపడి నటించగల హీరో అతనొక్కడే

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, అతని నటన గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడైన మహేష్ బాబు అందం అతనికి పెద్ద ఆస్తి. అందానికితోడు నటన ప్లస్ పాయింట్ గా మారింది. అద్భుతంగా నటిస్తాడు.ఏ పాత్రలోకైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేస్తాడు. ఎన్నో సినిమాలకు నంది అవార్డులు, జ్యూరీ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. దర్శకులందరూ కథ రాసుకునే సమయంలో ఒక్క మహేష్ బాబును దృష్టిలో ఉంచుకొనే కథలు రాసుకుంటారు. చివరకు అతను వద్దంటే.. ఖాళీ లేదంటేనే వేరే హీరో దగ్గరకు వెళతారు. మురారి క్లైమాక్స్ లో ప్రిన్స్ నటన చూసినవారెవరూ దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు.

నవసరాలను పోషించేది ఇద్దరే
నటనలో ఎంతో పరిణతి చూపిస్తూ భావోద్వేగాలను కూడా చక్కగా పండిస్తారు. నటుడు అన్నతర్వాత నవరసాలను పోషించాలి. అలా అన్ని రసాలను పండించగలిగే సత్తా ఉన్న ఏకైక నటుడు మహేష్ బాబు మాత్రమే. అతనికి పోటీగా నటించేది.. నవరసాలను అద్భుతంగా పోషించగలిగే నటుడు తెలుగులో ఒక్కడే ఉన్నాడు. నటన పరంగా అతనొక్కడే మహేష్ బాబుకు పోటీ ఇవ్వగలడు. కానీ వీరీద్దరి కాంబినేషన్ లో ఇంతవరకు సినిమా రాలేదు. అతనెవరంటే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. పుట్టుకతోనే నటుడైన జూనియర్ ఎన్టీఆర్ గురించి, అతని నటన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. దర్శకులందరికీ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మొదటి ఆప్షన్ గా ఉంటారు. మిగతా హీరోలంతా వీరు కదన్నతర్వాతే.

He is the only hero who can compete with Mahesh Babu in acting

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంచలనాలో
హాలీవుడ్ హీరోలకంటే అందంగా ఉండే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత హాలీవుడ్ సినిమాలు మాత్రమే చేసే అవకాశం ఉండొచ్చు అంటున్నారు. హాలీవుడ్ ను సైతం మెస్మరైజ్ చేయగలిగిన సత్తా ప్రిన్స్ కు ఉంది. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు బలం చేకూరుస్తూ ప్రృథ్వీరాజ్ పెట్టిన పోస్ట్ కూడా అలాగే ఉంది. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+