పిఠాపురం కుర్రాడికి జాక్‌పాట్‌ : ఏడాదికి రూ.1.06 కోట్ల ఏఐ ఉద్యోగం

కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, పేదరికాన్ని ప్రతిబంధకంగా అనుకోకుండా శ్రమిస్తే ఆకాశమే హద్దుగా రాణించవచ్చని నిరూపించాడు ఆంధ్రా కుర్రాడు. పుట్టుకతోనే మాటలు, వినికిడి శక్తి లేని ఒక సామాన్య టైలర్ కొడుకు.. ఈరోజు అంతర్జాతీయ స్థాయి ఏఐ సంస్థను తన ప్రతిభతో ముగ్ధుడిని చేశాడు. ఏకంగా రూ.1.06 కోట్ల భారీ వార్షిక ప్యాకేజీతో 'ఏఐ ఇంజనీర్'గా ఉద్యోగం సాధించి, తన కన్నవారి కష్టానికి సముచిత న్యాయం చేశాడు.

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం, కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన మాల్తి గంగాధరరావు, ఆయన భార్య దంపతుల కుమారుడే ఈ మాల్తి అఖిలేశ్. తండ్రి గంగాధరరావు చెవిటి, మూగ కావడంతో మాటలు రాని ఆవేదన ఒకవైపు ఉన్నా.. కుటుంబాన్ని పోషించేందుకు టైలరింగ్ వృత్తిని నమ్ముకున్నారు. భర్త కుట్టిన దుస్తులకు హేమింగ్, బటన్స్ చేస్తూ తల్లి కూడా అండగా నిలిచింది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో కూడా పిల్లల చదువుకు ఏనాడూ ఆటంకం రానివ్వలేదు. కొత్తపల్లిలోనే పదో తరగతి వరకు, ఆ తర్వాత ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అఖిలేశ్.. కన్నవారి త్యాగాలను కళ్లారా చూస్తూ పెరిగాడు.

Andhra Tailor Son Akhilesh Malthi Bags Rs 1 06 Cr Remote AI Job at Canada Firm Fabrantic AI in Placements

ప్రతిభకు పదును.. ప్లేస్‌మెంట్స్‌లో హిస్టరీ!

సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్ లో 'డేటా సైన్స్' ఇంజనీరింగ్ కోర్సులో చేరిన అఖిలేశ్, మొదటి సంవత్సరం నుంచే కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. క్యాంపస్ అందించిన ప్రత్యేక శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ తన నైపుణ్యాలకు పదును పెట్టాడు. ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కెనడాకు చెందిన ప్రముఖ సంస్థ 'క్వాంట్రైస్ టెక్ ఏఐ' (Quantrice Tech AI) ప్రతినిధులను తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఏకంగా రూ.1.06 కోట్ల భారీ ఆఫర్‌తో 'ఏఐ ఇంజనీర్'గా ఆఫర్ లెటర్ సాధించాడు.

IBPS Clerk Recruitment 2026: 11 వేల బ్యాంకు ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి
IBPS Clerk Recruitment 2026: 11 వేల బ్యాంకు ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి

కోట్ల రూపాయల ప్యాకేజీ సాధించడమే కాకుండా, అఖిలేశ్ ఇప్పటికే జాబ్ లో జాయిన్ కావడం విశేషం. ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ కావడంతో, కళ్లెదుటే కొడుకు అంతర్జాతీయ కంపెనీలో కోడింగ్ చేస్తూ పనిచేస్తుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అఖిలేష్‌తో పాటు అదే విశ్వవిద్యాలయానికి చెందిన రాజేష్ అనే మరొక విద్యార్థి కూడా రూ.1.06 కోట్ల ప్యాకేజీ సాధించడంతో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తూ వారిద్దరినీ ఘనంగా అభినందించారు.

డిగ్రీ ఉంటే చాలు.. బ్యాంక్‌లో రూ.85 వేల జీతంతో ఉద్యోగం!
డిగ్రీ ఉంటే చాలు.. బ్యాంక్‌లో రూ.85 వేల జీతంతో ఉద్యోగం!

ప్రేరణగా నిలిచిన విజయం!

ఒకప్పుడు పూట గడవడమే కష్టంగా ఉన్న ఇంట్లో, ఈరోజు కోట్ల రూపాయల వార్షిక వేతనం పొందే స్థాయికి కొడుకు ఎదగడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైకల్యాన్ని, పేదరికాన్ని జయించి అఖిలేశ్ సాధించిన ఈ విజయం.. ఎంతటి కష్టాల్లో ఉన్న విద్యార్థులకైనా సరికొత్త ఆశలను, నమ్మకాన్ని నూరిపోసే నిజమైన స్ఫూర్తిగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+