నాగ చైతన్య నుంచి సమంత ఎంత భరణం తీసుకుందో తెలుసా..?
నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థంతో హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.
సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. అభిమానులకు షాకిస్తూ శోభిత ధూళిపాళలను నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్నాడు.అయితే నాగ చైతన్య, శోభిత పెళ్లిపై సమంత స్పందిస్తారని అంతా భావించారు. కానీ ఆమె దీనిపై మౌనంగా ఉండిపోయారు. కేవలం అభిమాని పెళ్లి ప్రపోజల్‌పై మాత్రమే ఆమె రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమయంలో సమంత భరణానికి సంబంధించిన వార్త చక్కర్లు కొడుతోంది.

విడాకుల సమయంలో నాగ చైతన్య ఫ్యామిలీ సమంతకు రూ.200 కోట్ల రూపాయిల వరకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ డబ్బును తీసుకోవడానికి సమంత ఒప్పుకోలేదట. విడాకుల సమయంలో సమంత ఎమోషనల్ అవుతూ.. తాను ఎవరి మీద ఆధారపడి పైకి రాలేదని, ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్‌గా మారాననని, కాబట్టి ఎవరి మద్దతు, సహాయసహకారాలు నాకు అవసరం లేకుండానే నా మిగిలిన జీవితాన్ని కొనసాగిస్తానంటూ సమంత తెగేసి చెప్పిందట. దీంతో నాగ చైతన్య నుంచి సింగిల్ రూపి కూడా తీసుకోకుండా అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంత బయటకు వచ్చేసిందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై సమంతకు మద్దతుగా కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతూ.. నాగ చైతన్య సమంత లాంటి గ్రేట్ పర్సన్‌ను మిస్ చేసుకున్నారంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications