అల్లు అర్జున్‌తో వివాదం...వారి తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన హైపర్ ఆది
జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోలో తనదైనశైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆది తరువాత టీం లీడర్‌గా ఎదిగాడు. తన స్కిట్‌లను తానే రాసుకొంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్ ఆది మెగా అభిమాని అనే అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు హైపర్ ఆది వీరాభిమాని. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్‌పై తనకున్న అభిమానాన్ని చూపిస్తుంటాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన జనసేన తరుఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.
తాజాగా శివం భజే సినిమా ట్రైలర్ ఈవెంట్‌లో పాల్గొన్న హైపర్ .. మెగా, అల్లు వివాదంపై స్పందించారు. అల్లు అర్జున్ అంటే తనకు చాలా ఇష్టమని, జాతీయ అవార్డు సాధించిన ఏకైక హీరోగా అల్లు అర్జున్ నిలిచారని హైపర్ ఆది వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌కు అలాంటి ఫీలింగ్ లేదని, ఎప్పుడు కూడా ఉండదని వాళ్లంతా ఒకే ఫ్యామిలీ అని హైపర్ ఆది తేల్చేశారు. నేషనల్ అవార్డు సాధించిన అల్లు అర్జున్‌ని కొందరు ట్రోల్ చేయడం, నెగటివ్ థంబ్ నెయిల్స్ పెట్టడం తప్పని, ఇకనైనా ఆపేయండి అంటూ ట్రోలర్స్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు హైపర్ ఆది.

ఇదే సమయంలో ఎమ్మెల్సీ పదవిపై కూడా ఆయన స్పందించారు. జనసేన తరుఫున ఎన్నికల ప్రచారం చేయడంతో , హైపర్ ఆదికి ఎమ్మెల్సీ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై హైపర్ ఆది మాట్లాడుతూ..అలాంటిది ఏమి లేదని స్పష్టం చేశారు. తాను ఏదో ఆశించి , జనసేనకు ప్రచారం చేయలేదని,కేవలం పవన్ కల్యాణ్ కోసమే ప్రచారం నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఇక శివం భజే సినిమా అద్భుతంగా ఉంటుందని, సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను హైపర్ ఆది కోరారు.












Click it and Unblock the Notifications