ప్రభాస్-జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలకు కారణాలేంటి?

రెబల్ స్టార్, పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్, ఫౌజి చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాజాసాబ్ ముందు విడుదలవుతుందా? లేదంటే ఫౌజీ విడుదలవుతుందా? అనే సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ప్రభాస్ లేకుండానే ఫౌజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనితర్వాత స్పిరిట్ చిత్రం చేయాల్సి ఉంది. పరిశ్రమలో అందరితో ఎంతో స్నేహంగా ఉంటాడు. షూటింగ్ సమయంలో అందరికీ తన ఇంటిదగ్గర నుంచే భోజనం తీసుకువస్తాడు. ఒకరకంగా అజాత శత్రువు అని చెప్పొచ్చు. అటువంటి అజాత శత్రువు అయిన ప్రభాస్.. జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడంలేదంటే ఆశ్చర్యం వేస్తుంది.

దర్శకుడి వల్ల విభేదాలు?
వీరిద్దరి మధ్య మాటలు లేవు అనే విషయం తెలుగు ఫిలింనగర్ లో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు కాదులెండి ఈ చర్చ. కొన్నాళ్ల క్రితం జరిగిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్, తారక్ కనీసం ఆరునెలలపాటు మాట్లాడుకోలేదని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, పాన్ ఇండియా హీరోలుగా ఉన్న ఈ ఇద్దరికీ ఓ దర్శకుడి వల్ల విభేదాలు తలెత్తాయి. చిలికి చిలికి గాలివానలా మారినట్లు చివరకు వీరిద్దరూ దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఆ దర్శకుడు మాత్రం ఇద్దరితో బాగానే ఉంటాడు.

junior ntr and prabhas did not speak for six months because of a director

ఓ ఈవెంట్ లో ఎదురు పడ్డారు
ఇలా ఆరు నెలలు గడిచిన తర్వాత అనుకోకుండా ప్రభాస్, ఎన్టీఆర్ ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ క్రమంలో ఒకర్నొకరు ఎదురుపడటంతో ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకొని అక్కడే కలిసి కూర్చొని ఎందుకు విభేదాలు తలెత్తాయి? అందుకు కారణమేంటి? ఆ దర్శకుడు ఏం చెప్పారు? దానివల్ల మనమధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు రావల్సి వచ్చింది? ఎవరు తప్పుగా అర్థం చేసుకున్నారు? అనే విషయాలను కూలంకుషంగా చర్చించుకున్నారు. అప్పటినుంచి ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. ప్రస్తుతం తారక్ దేవర సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. కొరటాల మ్యాజిక్ కనుక పునరావృతమైతే సినిమా రికార్డులు సృష్టించడమేనని తారక్ అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాకు రూ.100 కోట్ల పారితోషికాన్ని ఎన్టీఆర్ తీసుకుంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+