వరుణ్-లావణ్య పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లకపోవడానికి కారణం అతడేనా?

మెగా కుటుంబంలోకి కొత్తజంట చేరింది. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రేమించి, పెద్దలచేత అంగీకరింప చేసుకొని ఓ ఇంటివారయ్యారు. వీరి ప్రేమ చిగురించిన ఇటలీలోనే వివాహం చేసుకున్నారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటివారంతా సతీసమేతంగా హాజరై కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహానికి సమంత, నాగచైతన్య, రష్మికలాంటివారు కూడా హాజరయ్యారు.

ఇటలీలో వివాహం చేసుకుంటుండటంవల్ల కేవలం దగ్గరివారు, బంధువులనే ఆహ్వానించారు. మిగతావారికి హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. పెళ్లికి రావల్సిందిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందించింది. ఆయన కూడా పెళ్లికి ఇటలీ వెళ్దామని అనుకున్నారు. అయితే చివరి నిముషంలో తాను చేస్తున్న దేవర సినిమా డైరెక్టర్ కొరటాల శివ సరికొత్తగా షెడ్యూల్ ఏర్పాటు చేయడంతోపాటు సినిమా షూటింగ్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను రూపొందించారు. దీంతో జూనియర్ గైర్హాజరయ్యారు.

junior ntr missed varuntej and lavanya tripathi marriage

జూనియర్ వరుణ్ పెళ్లికి వెళ్లకపోవడంవల్ల ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్-తారక్, అల్లు అర్జున్-తారక్, వరుణ్ తేజ్-తారక్ ను చూసే అవకాశం పోయిందని అభిమానులు బాధపడుతున్నారు. దీనికి కారణం కొరటాల శివేననంటూ సోషల్ మీడియాలో ఆయన్ను నిందించడం మొదలుపెట్టారు. అటువంటిదేమీ లేదని, సినిమా షెడ్యూల్ వల్లే ఆగిపోవాల్సి వచ్చిందని, దీనికి కారణం ఆలస్యమవకుండా దేవరను పూర్తిచేయాలనుకోవడమేనని తారక్ వివరణ ఇవ్వడంతో వీరంతా శాంతించారు. దేవరను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ప్రతి సన్నివేశం, ప్రతి ఫ్రేమ్ ఎడిట్ చేయడానికి వీల్లేకుండా వచ్చాయని, ఇటువంటి తరుణంలో సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు కొరటాల శివ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+