రామ్ చరణ్ సినిమాలో నటించి పెద్ద తప్పు చేశా..హీరోయిన్ సంచలన కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటించి తప్పు చేశానని షాకింగ్ కామెంట్స్ చేసింది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. కమలినీ ముఖర్జీ. ఆమె అసలు ఎందుకు ఈ కామెంట్స్ చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. కమలినీ ముఖర్జీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ, మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ భామ.
కమలినీ ముఖర్జీ నటిగా తన నటనకు గాను అనేక అవార్డులు అందుకున్నారు. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, విభిన్నమైన పాత్రలను పోషించారు. ఆమె తన సహజమైన నటన, ప్రత్యేకమైన శైలితో ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు. ఆమె నటించిన తొలి చిత్రం బెంగాలీ సినిమా 'ఫిర్ కభీ' (2004).

కానీ, ఆమెకు పేరు తెచ్చిన చిత్రం'ఆనంద్' (2004). ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టడంతో పాటు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక స్టార్‌గా ఎదిగేందుకు అవకాశం ఇచ్చింది. ఆమె విలక్షణమైన, సజీవమైన నటనతో అనేక పాత్రలను పోషించారు. గోదావరి ,హ్యాపీ డేస్, స్టైల్, గమ్యం, జల్సా, గోపి గోపిక గోదావరి , నాగవల్లి ,గోవిందుడు అందరివాడేలే,మన్యంపులి , మొదలగు సినిమాల్లో నటించింది.
తెలుగుతో పాటు, హిందీ, బెంగాలీ సినిమాల్లో కూడా ఈ బ్యూటీ నటించింది. తాజాగా ఈ భామ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తాజాగా కమలినీ ముఖర్జీ ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌తో నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమాపై స్పందించారు. ఈ సినిమా తర్వాత తెలుగులో నటించకూడదని ఫిక్స్ అయ్యానని చెప్పుకొచ్చింది.
సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పి, తర్వాత సినిమాలో నాది డమ్మీ పాత్రను చేశారని తెలిపింది. అయినప్పటికీ సినిమాను సర్దుకుపోయి ఆ చిత్రం పూర్తి చేశానని, ఆ సినిమా తర్వాత తెలుగులో నటించకూడదని అనుకున్నానని పేర్కొంది. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం గోవిందుడు అందరి వాడేలే. ఈ సినిమాతో ఆమె తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయింది.












Click it and Unblock the Notifications