Karthika deepam 2 October 14th Episode:భార్య మనసు విరిచిన దశరథ్;ఇల్లు వదిలి వెళ్లిపోయిన సుమిత్ర!
గత ఎపిసోడ్‌లో.. కంపెనీ భారాన్ని మోయమని తాత శివన్నారాయణ కార్తీక్‌కు మాట తీసుకోవడం, సీఈఓ పదవి కోసం తనకు సాయం చేయాలని జ్యోత్స్న కోరడం చూశాం. ముఖ్యంగా, 'నీ ప్లేస్ నీది కాదు' అని దీప హెచ్చరించడంతో జ్యోత్స్న భయం పట్టుకుంది.
నేటి 488వ ఎపిసోడ్ హైలైట్స్:
సీఈవో పదవి కోసం కార్తీక్ సాయం పొందాలనుకున్న జ్యోత్స్న, మొదట తల్లిదండ్రులు దశరథ, సుమిత్రలను కలపాలని ఆవేశంగా ఇంటికి వస్తుంది. "దీపకు అమ్మగా నిలబడినప్పుడు ఇంకా ఈ కోపం ఎందుకు?" అంటూ దశరథను నిలదీస్తుంది. జ్యోత్స్న ప్రవర్తనతో ఆగ్రహించిన దశరథ.. తన తండ్రి (శివన్నారాయణ) విషయంలో జోక్యం చేసుకోవద్దని మండిపడతాడు.మానవ సంబంధాలలో జరిగిన ప్రమాదాలు కోలుకోవడానికి సమయం పడుతుందని దశరథ అనగా, దీప వల్ల మా అమ్మ (సుమిత్ర) గాయపడింది, మరి శిక్ష ఎవరికి? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది.

దీంతో కోపం తట్టుకోలేకపోయిన దశరథ్.. "మీ అమ్మ ఎప్పుడైతే తప్పు చేసిందో, ఆ క్షణమే నా మనసు చచ్చిపోయింది. బుల్లెట్ జరిగిన రోజే చచ్చిపోతే బాగుండు" అంటూ తన భార్యను బాధపెట్టే మాట అంటాడు. భర్త మాటలకు సుమిత్ర విలపిస్తూ గదిలోకి వెళ్లిపోతుంది. ఈ ఘర్షణతో శివన్నారాయణ కుప్పకూలగా, కోపంతో కార్తీక్ జ్యోత్స్నపై మండిపడి బయటకు వెళ్తాడు.
మరోవైపు, ఈ గొడవ కారణంగా సుమిత్రపై అందరికీ సానుభూతి పెరుగుతుంది, దాన్ని అడ్డం పెట్టుకుని సీఈఓ పదవిని దక్కించుకోవచ్చని జ్యోత్స్న, పారులతో అంటుంది.
ఆ పక్కనే, భర్త మాటలతో తీవ్రంగా బాధపడిన సుమిత్ర.. "నేను లేకపోతే నా భర్త సంతోషంగా ఉంటాడు" అని భావించి ఇల్లు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. అర్థరాత్రి సుమిత్ర బయటికి వెళ్లడం చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. తల్లి ఇంటి నుంచి వెళ్లడం కూడా తనకు మంచిదేనని జ్యోత్స్న అనుకుంటుంది.
అనసూయ ఊరి నుంచి దీప కోసం తల్లి ఫోటో తీసుకురావడంతో దీప భావోద్వేగానికి లోనవుతుంది. సుమిత్ర ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లింది? కార్తీక్ ఎలా స్పందిస్తాడు? అనేది తర్వాత ఎపిసోడ్‌లో చూడాలి.












Click it and Unblock the Notifications