జానీ మాస్టర్ వివాదంపై స్పందించిన తొలి హీరో..!
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు రోజు రోజుకు తీవ్రతరం అవుతోంది. తన దగ్గర పని చేస్తోన్న మహిళా కొరియోగ్రాఫర్‌పై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదు అందడంతో జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ కేసుపై సినీ,రాజకీయ ప్రముఖులు సైతం రియాక్ట్ అవుతున్నారు. జనసేన నేత నాగబాబు జానీ మాస్టర్‌కు అండగా నిలవగా, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ జానీ మాస్టర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యాంకర్ అనసూయ బాధితురాలికి అండగా నిలిచారు.
దీనిపై రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి చాలామంది మహిళా నటులు స్పందించగా.. హీరోల్లో తొలిసారిగా మంచు మనోజ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. 'ఈ స్థాయికి రావడానికి జానీ మాస్టర్ ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసు. ఆయనపై ఆరోపణలు రావడం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. అసలు తప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం భావి తరాలకు ప్రమాదకర తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్లం అవుతాం. ఈ కేసులో త్వరగా స్పందించిన హైదరాబాద్ పోలీసులను ప్రత్యేక కృతజ్ఞతలు. మాస్టర్ తప్పు చేయకపోతే పోరాడండి.. దోషి అయితే వెంటనే లొంగిపోండి' అని మంచు మనోజ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దీంతో ఈ వివాదంపై స్పందించిన తొలి హీరోగా మంచు మనోజ్ నిలిచారు. ఈ సున్నితమైన కేసు విషయంలో ధైర్యంగా స్పందించిన మంచు మనోజ్‌పై నెట్టింట్లో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇక గోవాలో జానీ మాస్టర్‌ను చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి గోవా కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఈ రోజు సాయంత్రానికి జానీ మాస్టర్‌ను హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే పోలీసులు జానీ మాస్టర్‌ను కస్టడీ కోరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications