Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మే 1 నుంచి సినిమా థియేటర్లు బంద్?

తెలంగాణ (నైజాం ప్రాంతం)లో సినిమా థియేటర్లు మూతపదనున్నాయి. దీంతో ప్రదర్శన రంగంలో మరోసారి సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలన్న ఆలోచనలో ఎగ్జిబిటర్లు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా థియేటర్ యజమానులు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న ఆదాయ పంపిణీ వివాదమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

వివాదానికి కారణం ఏమిటి?

ప్రస్తుతం థియేటర్లలో సినిమా ప్రదర్శనకు రెండు విధానాలు అమల్లో ఉన్నాయి. రెంటల్ విధానం, పర్సెంటేజీ విధానం. ఇందులో రెంటల్ విధానం ప్రకారం థియేటర్ యజమాని నిర్మాతకు ముందే ఒక నిర్దిష్ట మొత్తం చెల్లిస్తాడు. కానీ పర్సెంటేజీ విధానంలో మాత్రం కలెక్షన్ల ఆధారంగా ఆదాయం శాతం ప్రకారం పంచుకుంటారు. ఇటీవల 23 సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు కలిసి రెంటల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, కేవలం పర్సెంటేజీ విధానంనే అమలు చేయాలని నిర్ణయించాయి. అయితే ఈ ప్రతిపాదనను నిర్మాతలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

movie-theatres-close-in-telangana-from-may-1st-and-news-got-viral-amoung-telugu-states-and-social-me

నిర్మాతలు vs ఎగ్జిబిటర్లు..

ఎగ్జిబిటర్లు మాత్రం తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు-"ప్రస్తుత పరిస్థితుల్లో రెంటల్ విధానం వల్ల భారీ నష్టాలు వస్తున్నాయి. సినిమాలు సరిగ్గా ఆడకపోతే మేమే నష్టపోతున్నాం. అందుకే పర్సెంటేజీ విధానం అవసరం" అంటున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం ఈ విధానం వల్ల తమకు నష్టాలు ఎక్కువవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా చిన్న, మధ్యస్థాయి సినిమాలకు ఇది ప్రమాదకరమని వారు చెబుతున్నారు.

ఫిలిం ఛాంబర్ పాత్ర..

ఈ వివాదంపై ఫిలిం ఛాంబర్ కూడా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 30లోగా ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు టాక్. ఇరు వర్గాలు ఒకే అభిప్రాయానికి రాకపోతే, థియేటర్ల మూసివేత తప్పదనే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే మల్టీప్లెక్స్‌ల పెరుగుదల, ఓటీటీ వేదికల ప్రభావంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి సమస్యలతో ఇవి ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితిలో ఆదాయ పంపిణీ వివాదం మరింత భారం అయ్యింది.

మూసివేత జరిగితే ప్రభావం..

మే 1 నుంచి నిజంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తే, అది సినిమా రంగంపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. చిన్న సినిమాలకు విడుదల అవకాశాలు తగ్గిపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో సినిమా ప్రదర్శన దాదాపు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అలాగే ప్రేక్షకులకు కూడా థియేటర్ అనుభవం దూరమయ్యే పరిస్థితి వస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగనుందో అని.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+