నాగచైతన్యకు చెప్పాను... వినలేదు... మీ ఇష్టం అని చెప్పా: నాగార్జున
అక్కినేని నాగార్జున కుటుంబంలో త్వరలో మరో శుభకార్యం జరగబోతోంది. పెద్ద కుమారుడు నాగచైతన్య డిసెంబరు నాలుగో తేదీన బాలీవుడ్ నటి, తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళను వివాహం చేసుకోబోతున్నారు. ఆయనకు ఇది రెండో వివాహం. ముందుగా సమంతను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. అక్కినేని అభిమానులు మాత్రం వీరిద్దరూ తిరిగి ఎప్పటికైనా కలవబోతారా? అంటూ ఆశగా ఎదురుచూసేవారు. వారి ఆశలను అడియాసలు చేస్తూ నాగచైతన్య శోభిను పెళ్లిచేసుకుంటున్నారు.
నిరాడంబరంగా ఉండాలని కోరుకున్నారు
ఈనెల నాలుగోతేదీన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోని 22 ఎకరాల స్థలంలో వీరి పెళ్లి జరగబోతోంది. దీనిపై అక్కినేని నాగార్జున మాట్లాడుతూ స్టూడియోలో కేవలం 300 నుంచి 400 మంది కుటుంబ సభ్యులు, అతిథులు, స్నేహితులు, పరిశ్రమలోని కొందరు సన్నిహితుల సమక్షంలో వివాహం జరగబోతున్నట్లు నాగార్జున వెల్లడించారు. వివాహాన్ని బాగా భారీగానే చేయాలని తాను అనుకున్నప్పటికీ నాగచైతన్య-శోభిత.. ఇద్దరూ తమ వివాహం నిరాడంబరంగా ఉండాలని కోరుకున్నారని, దీంతో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను కూడా వారికే వదిలేసినట్లు చెప్పారు. వారిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వారి ఇష్టానుసారమే వివాహ ఏర్పాట్లు కూడా ఉంటే వారే సంతృప్తిగా ఉంటారని నాగార్జున వ్యాఖ్యానించారు.

ముంబయిలోనా? హైదరాబాద్ లోనా?
ఏమాయ చేశావే సినిమాతో నాగచైతన్యకు, సమంతకు పరిచయం అయింది. తర్వాత అది ప్రేమగా మారి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. అనివార్య కారణాలతో విడిపోవడంతోపాటు మయోసైటిస్ సోకడంతో ఏడాదిన్నరపాటు సమంత సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం అవకాశాలు రావడంలేదని వ్యాఖ్యానించింది. విడిపోయిన రెండు సంవత్సరాల తర్వాత నాగచైతన్యకు శోభితతో పరిచయం అవడంతో అది పెళ్లికి దారితీసింది. త్వరలోనే వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు. కాపురం హైదరాబాద్ లో పెడతారా? ముంబయిలో పెడతారా? అనేది నాగచైతన్య నిర్ణయాన్ని బట్టి ఆధారపడివుంటుంది. ముంబయిలో కాపురం పెడదామని శోభిత చెబుతోంది. పెళ్లయిన తర్వాత కాపురం ఎక్కడ పెడతారనేది చూడాలి. వీరిద్దరు కూడా 2027లో విడిపోతారని వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అతను కేసులను ఎదుర్కొంటున్నాడు.












Click it and Unblock the Notifications