ఆ హీరో కుటుంబంలో ఎవరూ 50 ఏళ్లకు మించి బతకలేదు!!
ప్రతి మనిషికి తన జీవితం నాలుగు దశలుగా సాగుతుంది. బాలయ్యం, యవ్వనం, మధ్యస్థం, వృద్ధాప్యం. తన జీవితంలో అన్ని దశలను మనిషి చూడటం జరుగుతుంది. ఎవరన్నా అకాల మరణానికి గురైతే తప్ప అందరూ అన్ని వయసుల్లో, అన్నిదశల్లో వీటిని అనుభవించాలి. అప్పుడు జీవితం అర్థం తెలుస్తుంది. అయితే ఒక బాలీవుడ్ హీరో కుటుంబంలో మాత్రం ఎవరూ 50 సంవత్సరాలకు మించి జీవించలేదు. అందరూ 50 ఏళ్లలోపే మరణించారు. వారెవరూ వృద్ధాప్యాన్ని అనుభవించలేదు.
వృద్ధాప్యాన్ని చూడలేను అనేవారు
బాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను తెచ్చుకొని, తక్కువ వయసులోనే స్టార్ హీరో అయ్యారు సంజీవ్ కుమార్. అటువంటి వ్యక్తి కూడా 47 సంవత్సరాల వయసులోనే మృతిచెందారు. కెరీర్ లో మంచి దశలో ఉన్నప్పుడు ఆయన మృత్యువాత పడ్డారు. వృద్ధాప్యాన్ని తాను కూడా చూడటం జరగదనే ఉద్దేశంతో సినిమాల్లో వృద్ధాప్య వేషాల్లో జీవించేవారు. ఆ పాత్ర పోషించినప్పుడల్లా తన వృద్ధాప్యాన్ని తాను చూడలేనని, అందుకే పాత్రలద్వారా వృద్ధాప్యాన్ని అనుభవిస్తున్నానని తోటి నటీనటులతో అనేవారు. మరణం ముందే తెలిసి ఆయన అలా మాట్లాడుతుండేవారా అని వారంతా అభిప్రాయపడేవారు. తన తాత, తండ్రి, సోదరులు.. ఇలా అందరూ 50 ఏళ్లలోపే మరణించడంతో తనకు కూడా ఆ తరహా మరణం తప్పదనేవారు.

సూపర్ స్టార్ గా రాణించారు
1970, 1980 దశకాల్లో హిందీ సినీ పరిశ్రమను సంజీవ్ కుమార్ ఏలారని చెప్పొచ్చు. మౌసం , నయా దిన్ నై రాత్ , నౌకర్, అంగూర్, షోలే, పతి - పత్ని ఔర్ వంటి అద్భుత చిత్రాల్లో నటించారు. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర లాంటి సూపర్ స్టార్ల మధ్య ఆయన తన వయసును ధిక్కరించి పోషించిన పాత్రలు అజరామరంగా నిలిచాయి. వాటిని ఈరోజుకు సినీ ప్రియులు మరిచిపోలేదు. 47 సంవత్సరాల వయసులో గుండెపోటు రాగా శస్త్రచికిత్స చేశారు. అది జరిగిన కొద్దిరోజులకే 1985 నవంబరు ఆరోతేదీన మృతిచెందారు. 50 సంవత్సరాల్లోపే కుటుంబ సభ్యులంతా మరణించడం వారికి శాపమా? మరేదైనా కారణమా? అనే చర్చ అప్పుడప్పుడు నడుస్తుంటుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఆశ్చర్యానికి లోనయ్యేవారు.












Click it and Unblock the Notifications