బాలయ్యపై రాజకీయం.. బయ్యర్లను హైదరాబాద్ పంపిన రాజకీయ నేత
నందమూరి నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'అఖండ2' చిత్రం డిసెంబరు 12వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం మిశ్రమ స్పందన దక్కించుకుంది. అయితే ఎక్కువ ధరలకు అమ్ముడుబోవడంతో నైజాం మినహా ఎక్కడా లాభాలు రాలేదంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నష్టాలు వచ్చాయని చెబుతున్న బయ్యర్లను ఓ రాజకీయ నేత వారందరినీ హైదరాబాద్ పంపించినట్లు తెలుస్తోంది. సినిమాను అధిక ధర పెట్టి కొన్నా కాబట్టి తమ డబ్బులను తిరిగివ్వాలని వారంతా దర్శకుడు బోయపాటి శ్రీనును కలిసి ఒత్తిడి చేశారు. అయితే తాను చేయగలిగినంత సాయం చేస్తానని, అయితే మీరంతా వెళ్లి మ్యాంగో మీడియా అధినేత రామ్ ను కలవాలని సూచించారు.
రామ్ దగ్గరకు వెళ్లమన్నాడు బోయపాటి
ఈ సినిమా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట జీఎస్టీ పోను మిగతావాటిని ఇస్తామనే హామీ ఇచ్చినట్లు తెలుగు సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అఖండ2ను ఏయే ఏరియాల్లో ఎంతెంత ధరలకు అమ్మారు? ఎంత వసూలైంది? ఎంత లాభం వచ్చింది? ఎంత నష్టం వచ్చింది? తదితర వివరాలన్నీ పూర్తిగా మ్యాంగో మీడియా రామ్ కు తెలుసు. అందుకే దర్శకుడు బోయపాటి తనను కలిసిన బయ్యర్లను రామ్ దగ్గరకువెళ్లమని సలహా ఇచ్చారు.

చివరకు ఆ నేత ఏం చేస్తారో చూడాలి
అయితే ఇదంతా జరగడానికి ఓ కీలకమైన రాజకీయ నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రాజకీయంగా తనకు ప్రత్యర్థి అయిన నందమూరి బాలకృష్ణను ఇబ్బంది పెట్టే అవకాశం కోసం ఎదురుచూస్తుండగా, ఆ అవకాశం ఇప్పుడు రావడంతో వెంటనే రంగంలోకి దిగారు. వెంటనే తనకు అనుకూలంగా ఉండే బయ్యర్లతో మాట్లాడించి వారిని హైదరాబాద్ పంపించారు. సినిమాకు సంబంధించి కొనుగోలు చేసిన డబ్బులను వెంటనే ఇవ్వాలని, తమ నష్టాన్ని భరించాలని నిర్మాత, దర్శకులపై ఒత్తిడి చేయాలని చెప్పి పంపించినట్లు సమాచారం. ఆ ఒత్తిడి చివరకు బాలయ్యపై పడుతుందని ఆ రాజకీయ నేత ఆలోచన. అయితే బయ్యర్లను బోయపాటి తెలివిగా రామ్ దగ్గరకు పంపించారు. మరి రామ్ వీరికి ఏం చెబుతారో చూడాలి. ఎందుకంటే ఇదంతా కావాలనే ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోందని బాలయ్య నుంచి నిర్మాత, దర్శకులు, రామ్ వరకు అందరికీ తెలుసు. అందుకే ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. చివరకు ఆ రాజకీయ నేత ఏం చేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications