పవన్ కల్యాణ్‌కు పూనమ్ కౌర్ కౌంటర్ ..ఆ హత్యకు లింక్ చేస్తూ ట్వీట్
హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె గతంలో పలుమార్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. ఏపీ ఫలితాలు వచ్చిన తర్వాత ఆమె తాజాగా మరోసారి పవన్‌ను పరొక్షంగా టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..హీరోయిన్ పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటారు.
అయితే పూనమ్ కౌర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌లపై ఎప్పుడూ పరొక్షంగా ట్వీట్లు చేస్తోంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్, త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటుంది. తాజాగా మరోసారి పవన్‌ను టార్గెట్ చేసుకుని ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. సుగాలి ప్రీతీ మరణం గురించి ప్రస్తావిస్తూ ఆమె ట్వీట్ చేశారు. సుగాలి ప్రీతీ హత్య జరిగి చాలా కాలం అయిందని..దానిపై సమగ్ర విచారణ జరిపి వారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.

2017లో కర్నూలులో సంచలనం రేపిన సుగాలి ప్రీతీపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై ఆమె తల్లి న్యాయపోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటం ఈ కేసుపై అప్పటి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కేసును పెద్దగా పట్టించుకుంది లేదు. అయితే ఇటీవల ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సుగాలి ప్రీతీ హత్య జరిగితే ఎవరు స్పందించలేదు కానీ సీఎం జగన్ మీద రాయి వేస్తే మాత్రం ఏదో జరిగినట్టు బాధపడుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. తాజాగా పవన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా హీరోయిన్ పూనమ్ కౌర్ సుగాలి ప్రీతీ హత్యకు సంబంధించిన నిందితులను శిక్షించి వారి తల్లికి న్యాయం చేయాలంటూ ట్వీట్ చేశారు.
Waiting to see #sugalipreeti issue getting resolved in #andhrapradesh, her mother deserves long awaited justice - 🙏.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 6, 2024












Click it and Unblock the Notifications