ప్రముఖ నటి శోభిత మృతి..తన ఫ్లాట్‌లోనే విగతజీవిగా
ప్రముఖ కన్నడ బుల్లితెర నటి శోభిత శివన్న మృతి చెందారు. పలు కన్నడ సీరియల్స్‌లో నటించిన శోభిత ఈరోజు (డిసెంబర్ 1) కన్నుమూశారు. ఇతర భాషా సీరియల్స్‌లో నటించిన శోభిత పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సకలేష్‌పూర్‌కు చెందిన శోభిత శివన్నకు మొదటి నుంచి నటనపై ఆసక్తిగా ఉండేది. వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకుంటూ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా కన్నడ సీరియల్ బ్రహ్మగంతు నిన్హిందాలేలో నటించిన శోభిత ఇతర భాషల్లోని సీరియల్స్‌లో కూడా నటించింది.
కన్నడ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టిన శోభిత శివన్న వందన అటెంప్ట్ టు మర్డర్, జాక్‌పాట్ చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా లక్ష్మీ బారమ్మ సీరియల్ ఫేమ్ చందూగౌడతో శతభిషే సినిమాలో కూడా నటించింది.గత ఏడాది మే 22, 2023న పెళ్లి చేసుకున్న నటి శోభిత శివన్న, పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి హైదరాబాద్‌లో నివసం ఉంటోంది.

ఏం జరిగిందో తెలియదు కాదు కానీ ఆదివారం తన ప్లాప్‌లో శోభిత విగతజీవిగా కనిపించింది. శోభిత ఆకస్మిక మరణ వార్త బయటకు రావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. శోభిత మరణంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని శోభిత నివాసానికి చేరుకున్నారు. ఉస్మానియా హస్పటల్ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బెంగళూరుకు తరలిస్తారని తెలుస్తోంది. శోభిత మరణంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications