ప్రభాస్-సందీప్ వంగా 'స్పిరిట్' లో హీరోయిన్ ఖరారు?
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సలార్. రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తనను తొక్కిపెట్టాలనుకుంటున్న బాలీవుడ్ మాఫియాకు గట్టి షాక్ ఇచ్చాడు. తర్వాత రాజాసాబ్ తోపాటు కల్కి చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా మే 9న విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా వైజయంతీ మూవీస్ దీన్ని విడుదల చేయబోతోంది. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ చేయబోయే చిత్రాలు రెండు లైనులో ఉన్నాయి. ఒకటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ కాగా, మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 ఒకటి.
యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ ను అద్భుతంగా చూపించి ప్రశంసలు కొట్టేసిన సందీప్ స్పిరిట్ లో డార్లింగ్ ను ఎలా చూపిస్తాడా? అనే ఉత్కంఠ సినీ ప్రియుల్లో నెలకొంది. ఇందులో హీరోయిన్ గా యానిమల్ లో నటించిన రష్మికను తీసుకోవాలనుకుంటున్నారు. అయితే మరోసారి తమ కాంబినేషన్ ను పునరావృతం చేయడంకన్నా అలియాభట్ ను తీసుకోవాలనే యోచనలో సందీప్ ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఈ ఇద్దరు హీరోయిన్లలో ఒకరు ఖరారవుతారని సమాచారం.

యానిమల్ పార్ట్ 2 గా తీయబోతున్న యానిమల్ పార్క్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. సందీప్ టీమ్ ప్రస్తుతం ఈ పనుల్లోనే బిజీగా ఉంది. ప్రభాస్ డేట్లను కేటాయించేదాన్ని బట్టి స్పిరిట్ ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయం ఆధారపడివుంటుంది. డార్లింగ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో లోబడ్జెట్ మూవీగా రాజాసాబ్ చేస్తున్నారు. హైబడ్జెట్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కచ్చితంగా విజయం సాధిస్తాయనే ధీమాలో డార్లింగ్ అభిమానులు ఉన్నారు. అలాగే సలార్ 2తో రూ.1000 కోట్లకు పైబడిన కలెక్షన్లు అందుకుంటామంటున్నారు.












Click it and Unblock the Notifications