రకుల్‌తో ఐదు రోజులు షూట్ చేసి సినిమా క్యాన్సిల్ చేసుకున్న ప్రభాస్
ప్యాన్ స్టార్ ప్రభాస్ గురించి క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ''బాహుబలి'' సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు రూ.50 కోట్ల కలెక్షన్స్ కూడా దాటని ప్రభాస్ సినిమాలు వందల, వేల కోట్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ''బాహుబలి-2'' ఏకంగా రూ.2000 కోట్లు కలెక్ట్ చేసి ట్రెండ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వచ్చిన సాహో, ఆదిపురుష్ , రాధే శ్యామ్ వంటి సినిమాలు నిరాశపరిచినప్పటికి , సలార్, కల్కి వంటి సినిమాలు మరోసారి ప్రభాస్ స్టామినాను నిరూపించాయి.
ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ప్రభాస్ నటించిన 'మిస్టర్ పరఫెక్ట్' సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో అందరికి తెలిసిందే. చాలా సెన్సిటివ్ పాయింట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్లుగా నటించారు.

అయితే ఈ సినిమాలో మొదట రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారట. రకుల్‌తో ఐదు రోజులు షూటింగ్ కూడా జరిగింది. రష్ చూసేసరికి ఎవ్వరికీ నచ్చలేదు. కథ మొత్తం అమ్మాయి మీద ఉంటుంది. కానీ చాలా సన్నగా ఉన్న రకుల్ ప్రియ పాత్రకు ఏ మాత్రం నప్పలేదు.దీంతో రకుల్‌తో ఈ సినిమా వర్క్ అవుట్ కాదని భావించిన చిత్ర యూనిట్ ఆమెను తప్పించి కాజల్ అగర్వాల్‌ను ఈ సినిమాలోకి తీసుకువచ్చారట.
ప్రభాస్-కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో అప్పటికే డార్లింగ్ వంటి క్లాస్ హిట్ రావడంతో నిర్మాత దిల్ రాజు కాజల్ అగర్వాల్ వైపు మొగ్గు చూపించారట. దాంతో రకుల్ ప్లేస్‌ను కాజల్‌తో రీప్లేస్ చేశారు. ఇక ప్రియగా కాజల్ అదరగొట్టిందనే చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్‌ను కూడా డామినేట్ చేస్తూ కాజల్ యాక్ట్ చేసింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలా తన బాడీ సైజ్ వల్ల ప్యాన్ ఇండియా స్టార్‌తో సినిమా చేసే అవకాశం రకుల్ కోల్పోయింది.












Click it and Unblock the Notifications