గుడ్ న్యూస్ చెప్పిన రామ్ చరణ్ దంపతులు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెటిజెన్లు ఈ పోస్టు చూసి కంగ్రాట్స్ చెబుతున్నారు. లవ్ సింబల్స్, ఫైర్ సింబల్స్, పెద్ది ఈమోజీలతో ఇన్ స్టా గ్రామ్ ను నింపేస్తున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటో తెలుసా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పోస్టు చేశారు. ప్రధాని మోదీని కలిసిన ఫోటోలను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇటీవల అనిల్ కామినేని నేతృత్వంలో జరిగిన ప్రపంచంలోని మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విశేషాలను ప్రధాని మోదీకి వివరించేందుకు ఆయన్ను కలిసినట్లు రామ్ చరణ్ తెలిపారు.
" ప్రధాని మోదీని కలిసినందుకు గౌరవంగా ఉంది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయాన్ని ఆయనతో పంచుకున్నాను. ఈ లీగ్ కు అనిల్ కామినేని నేతృత్వం వహించారు. క్రీడలపై ప్రధాని మోదీకి ఉన్న కసి, పట్టుదల మాకు ఎంతో ప్రేరణ, స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎంతో సహకరిస్తాయి" అని రామ్ చరణ్ తెలిపారు. ఈ పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు స్పషల్ విషెస్ తెలిపారు. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం ఈ క్రీడా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగానే ప్లాన్ చేసినట్టు వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీ ఉత్తరాంధ్ర ఏరియా నేపథ్యంగా తెరకెక్కుతోంది. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివ్ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు.. కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications