Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2025 సంక్రాంతి దంగల్... విజేత ఎవరో..?

తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి అతిపెద్ద పండగ. ఈ పండగకు రిలీజయ్యే ఏ సినిమా అయినా మినిమమ్ గ్యారంటీ హిట్ అవుతుందని పేరుంది. అయితే ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ "డాకు మహారాజ్", గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ "గేమ్ ఛేంజర్", విక్టరీ వెంకటేశ్ "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు ఆయా సినిమాలపై అంచనాలను అమాంతం పెంచేశాయి. మరి ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే.. ?

2019 దంగల్ రిపీట్..
2019 సంక్రాంతి టైమ్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ "ఎన్టీఆర్ కథానాయకుడు" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి కలయికలో "వినయ విధేయ రామ" అంటూ సందడి చేశారు. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన "ఎఫ్ 2" సైతం సంక్రాంతి కానుకగా రిలీజైంది. అయితే చెర్రీ నటించిన "వినయ విధేయ రామ" చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సినీ విశ్లేషకులు ఈ మూవీని బాక్సాఫీస్ బాంబ్ గా అభివర్ణించారు. ఇక నటసింహ నందమూరి బాలయ్య నటించిన "ఎన్టీఆర్ కథానాయకుడు" చిత్రం సైతం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఇక విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ "ఎఫ్ 2" సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ మూవీ అప్పట్లోనే రూ.85 కోట్ల మేర గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వెంకీ స్టైల్ కామెడీ, అనిల్ టేకింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా చెప్పవచ్చు.

Ramcharan NBK and Venkatesh Will 2019 boxoffice repeat deets here

'డాకు మహారాజ్' దూకుడు..
అయితే 2019 మాదిరిగానే ఈ సారీ కూడా సేమ్ స్టార్స్ .. సంక్రాంతి బరిలో నిలవడం విశేషం. నందమూరి బాలకృష్ణ, యాక్షన్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం "డాకు మహారాజ్". ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరీ, బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. మరి ఈ సినిమా బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తుందా? లేదా? అనేది మరో వారం రోజుల్లో తేలనుంది.

పాన్ ఇండియా కలెక్షన్స్ లక్ష్యంగా..
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం "గేమ్ ఛేంజర్". నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలోని సాంగ్స్ కే ఏకంగా రూ. 75-85 కోట్లు ఖర్చు చేశారంటేనే ఈ సినిమాను దర్శకుడు శంకర్.. ఏ రేంజ్ లో తెరకెక్కించారో తెలుస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ ప్రధాన టార్గెట్ గా వస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే "ఆర్ఆర్ఆర్" తో బాలీవుడ్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన చెర్రీ.. మరోసారి గ్లోబల్ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో వేచి చూడాలి.

2019 సంక్రాంతి సీన్ రిపీట్..
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ అని ఇప్పటికే రుజువైంది. వీరి కాంబోలో వచ్చిన "ఎఫ్ 2", "ఎఫ్ 3" సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టాయి. వీరి కాంబోలో వస్తున్న మూడో చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం".. ఈ సారి కామెడీతోపాటు క్రైమ్, సస్పెన్స్ నూ మేళవించి ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు అనిల్. ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరీ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. మరి ఈ సంక్రాంతి విన్నర్ గా విక్టరీ వెంకటేశ్ నిలుస్తారో లేదో మరో వారం రోజుల్లో తెలుస్తుంది. 2019 సంక్రాంతి సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని చిత్ర యూనిట్ ఆశాభావంతో ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+